ఆ సెటైర్లపై విరుచుకుపడ్డ దర్శకుడు..!

0

సమీక్షల్లో నెగెటివ్ గా రాసినా.. లేదా ఇంటర్వ్యూల్లో నెగెటివ్ క్వశ్చన్ స్ట్రైక్ చేసినా ఇండస్ట్రీ జనాల్లో రిప్లయ్ కూడా అదే రేంజులో ఉంటుంది. ఒక్కోసారి ముఖంపై కొట్టినట్టే అడిగే ప్రశ్నలకు అప్పటికి సైలెన్స్ అయ్యి తప్పించుకున్నా.. ఆ తర్వాత సీరియస్ అయ్యేవాళ్లున్నారు. ఇది కూడా అలాంటిదేనేమో! దర్శకుడు అనీల్ రావిపూడి ఓ చాట్ కార్యక్రమంలో మీడియాపై తన అసహనాన్ని బయటపెట్టేయడం చర్చకు వచ్చింది.

ఇంతకీ అతడికి ఏం చిక్కొచ్చి పడింది? అంటే.. కళ్యాణ్ రామ్ – పటాస్ సినిమా టైమ్ లో అదో చెత్త సినిమా అంటూ తీసిపారేసిందట మీడియా. పటాస్ విడుదలకు ముందే ప్రివ్యూ వీక్షించి .. ఎలాంటి ఎలివేషన్స్ లేని.. హీరోయిజం లేని చెత్త చిత్రం అని తిట్టేశారట. అయితే అదే సినిమాని పంపిణీదారుడు అయిన దిల్ రాజుకు ప్రదర్శించాక.. రెస్పాన్స్ వేరేగా ఉంది. ఇది కళ్యాణ్ రామ్ కెరీర్ లో అతిపెద్ద హిట్లలో ఒకటిగా నిలుస్తుందని అన్నారట. ఈ విషయాన్ని రావిపూడి రకరకాల సందర్భాల్లో మీడియాతో తన లొల్లును కూడా మీకు మాత్రమే చెప్తా (తరుణ్ భాస్కర్) టాక్ షోలో బయటపెట్టాడు.

“ఒకరి జీవితం .. వృత్తి కంటే మీకు డబ్బు ముఖ్యమా?“ అంటూ మీడియాని ప్రశ్నించారు రావిపూడి. మొత్తానికి తనలోని అగ్రెస్సివ్ కోణాన్ని ఇలా బయటపెట్టేశారు రావిపూడి. సంక్రాంతికి రిలీజై హిట్ కొట్టిన `సరిలేరు నీకెవ్వరు`పైనా మీడియా ఓ రేంజులో విమర్శించింది. అందులో క్రియేటివిటీ స్టఫ్ అంతంత మాత్రమేనని కొందరు విమర్శించారు. మరి దానికి కూడా అనీల్ చిన్నబుచ్చుకున్నారా? .. ఇక మీడియాపై సెటైర్లు వేసే వారి జాబితాలో రామ్ గోపాల్ వర్మ- పూరి అండ్ టీమ్ ఉన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో ప్రతి సెలబ్రిటీ కి మీడియాతో చిక్కు తప్పదు. అయితే అదే మీడియా ప్రమోషన్ కూడా అంతే ఇంపార్టెంట్. మంచి రిలేషన్ షిప్ తో పెద్ద స్థాయికి ఎదిగిన వారెందరో ఉన్నారు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-