అట్లీ.. షారుక్ తోనా ? తారక్ తోనా?

0

ఎంతో మంది దర్శకులు వస్తుంటారు.. పోతుంటారు.. కొందరు మాత్రమే ప్రేక్షకుల నాడి పట్టుకుని విజయాలతో తమదైన మార్క్ చూపిస్తుంటారు. ఆ కోవకి చెందిన దర్శకుడే అట్లీ. రాజమౌళి.. కొరటాల తరహాలో తమిళంలో అపజయమెరుగని దర్శకుడిగా తనకంటూ ఓ గుర్తింపు వచ్చింది. శంకర్- మురుగుదాస్ దగ్గర శిష్యరికం చేసిన అట్లీ.. అతి కొద్దికాలంలో గురువులను మించి శిష్యుడిగా ఎదిగిపోవడం గమనార్హం. ఈయన తమిళంలో తీసిన తేరి- మెర్సల్- బిగిల్ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల దుమారం రేపాయి. భారీ విజయాలతో అట్లీకి గొప్ప పేరు తెచ్చిపెట్టాయి. మంచి మాస్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన అట్లీ తర్వాత సినిమా ఎవరితో చేయబోతున్నారు ? ఎంత బడ్జెట్ లో రూపొందించబోతున్నారు ? టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారా ? లేదా ఏకంగా బాలీవుడ్ లోనే అడుగు పెట్టబోతున్నారా? .. అయితే ఈ యువ సంచలన దర్శకుడి చూపు మాత్రం బాలీవుడ్ వైపు ఉందని సినీ వర్గాలు అంటున్నాయి. కొద్ది రోజుల క్రితం బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ కు కథ వినిపించారని తెలిసింది. ఈ కథ షారుక్ కు బాగా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సినీ వర్గాల్లో ముచ్చట సాగుతోంది.

షారుఖ్ 2018లో జీరో చిత్రం చేశారు. ఈ సినిమా పూర్తిగా నిరాశ పరచడంతో ఆయన కథల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారని బాలీవుడ్లో అనుకుంటున్నారు. తాజాగా అట్లీ చెప్పిన కథ నచ్చడంతో షారుక్ ఓకే చెప్పేశారని ఇక ఈ సినిమా ఏప్రిల్లో పట్టాలెక్కడమే ఆలస్యమని సమాచారం. మరో వైపు కొద్దిరోజుల క్రితం వైజయంతీ బ్యానర్పై అశ్వనీదత్ కొత్త సినిమా నిర్మించబోతున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా చేస్తున్నట్లు చెప్పారు. ఇంతకు ముందు యువ దర్శకుడు అట్లీ జూనియర్ ఎన్.టీ.ఆర్ ను కలిసి ఒక కథ వినిపించారు. ఈ కథతోనే అశ్వనీదత్ తెరకెక్కించబోతున్నారా ? లేదా మరేదైనా కథను ఎంచుకున్నారా? అన్నది ఇప్పటికి సస్పెన్స్. అయితే అట్లీ చెప్పిన కథే జూనియర్ ఎన్.టీ.ఆర్ తో వైజయంతీ బ్యానర్ చేయబోతోందా? అన్నది తేలాల్సి ఉంది.

అసలు అట్లీ షారూక్ కి జూనియర్ కి కథలు చెబితే ఎవరితో ముందుగా సెట్స్ కెళుతున్నట్టు? అన్నది తేలాల్సి ఉంది. మరో వైపు రాజమౌళి నిర్మిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీలో జూనియర్ ఎన్.టీ.ఆర్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో పూర్తయితేగానీ ఎన్.టీ.ఆర్ మరో చిత్రంలో నటించే అవకాశం లేదు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-