మెగాస్టార్ కోసం పవర్ ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్న యంగ్ డైరెక్టర్…?

0

బాబీ (కేఎస్ రవీంద్ర).. ప్రస్తుతం టాలీవుడ్ లో ప్రతిభ గల యువ దర్శకులలో ఒకరు. అసిస్టెంట్ డైరెక్టర్ గా స్క్రిప్ట్ రైటర్ గా పలు చిత్రాలకి పని చేసిన బాబీ మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందిన ‘పవర్’ చిత్రంతో దర్శకుడిగా టాలీవుడ్ కి పరిచయమయ్యాడు. ఆ తర్వాత ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాని డైరెక్ట్ చేసి అందరూ ఈ యంగ్ డైరెక్టర్ లో ఏదో టాలెంట్ ఉందే అనుకునేలా చేసాడు. పవన్ తో తెరకెక్కించిన ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ ప్లాప్ అయినప్పటికీ డైరెక్టర్ గా బాబీ కి మంచి మార్కులే పడ్డాయి. దీంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ‘జై లవకుశ’ చిత్రం తెరకెక్కించాడు. తారక్ ని ముందెన్నడూ చూడని విధంగా మూడు పాత్రల్లో చూపించి అలరించాడు. రెండేళ్ల గ్యాప్ తీసుకొని ‘వెంకీ మామ’ అనే మల్టీస్టారర్ తో ముందుకొచ్చాడు. మామా అల్లుళ్ళు విక్టరీ వెంకటేష్ – అక్కినేని నాగ చైతన్యలను ఒకే స్క్రీన్ మీద చూపించి అబ్బురపరిచారు. గతేడాది చివర్లో రిలీజైన ‘వెంకీ మామ’ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ద్వారా దర్శకుడిగా మరో మెట్టు ఎక్కాడు బాబీ. అయితే బాబీ టాలీవుడ్ మెగాస్టర్ చిరంజీవి ని డైరెక్ట్ చేసే అవకాశం కొట్టేశాడని వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కంఫర్మ్ చేశారు. యంగ్ డైరెక్టర్ బాబీ చెప్పిన స్టోరీ లైన్ నచ్చిందని చెప్పుకొచ్చాడు. దీంతో కెరీర్లో స్టార్ హీరోలను డైరెక్ట్ చేసే అవకాశం దక్కింది.. బాబీ లక్కీ అంటూ కామెంట్స్ వినిపించాయి. అయితే బాబీ మాత్రం లక్ ఉంటె సరిపోదు టాలెంట్ కూడా ఉండాలి అంటున్నాడట.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో బాబీ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి పలు విషయాలు చెప్పుకొచ్చాడట. లాక్ డౌన్ సమయంలో స్క్రిప్ట్ వర్క్ పూర్తీ చేసుకునే పనిలో ఉన్నానని తెలిపాడట. అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవికి చెప్పిన స్టోరీ లైన్ ఆయనకు నచ్చిందని.. కంప్లీట్ స్క్రిప్ట్ పూర్తి చేసే పనిలో పడ్డానని చెప్పుకొచ్చాడట. మెగాస్టార్ ఫ్యాన్స్ కి నచ్చేలా ఈ స్టోరీ ఉండబోతోంది.. ఇప్పుడే దీని గురించి ఇంతకంటే ఎక్కువ ఏమీ చెప్పలేను అని చెప్పారట. కెరీర్ లో అందరూ పెద్ద హీరోలతో వర్క్ చేస్తున్నారు.. మీరు అదృష్టవంతులు అనుకోవచ్చా అని ప్రశ్నించగా లక్ ఒక్కటే సరిపోదు. దానికి తగ్గ స్టఫ్ కూడా ఉండాలి. మంచి స్టోరీస్ రాయగలిగి ఉండాలి.. వాటిని హీరోలకు చెప్పి వాడిని డెవలప్ చేయగలగాలి.. నా మొదటి హీరో రవితేజ గారు నా టాలెంట్ గుర్తించి నాకు దర్శకుడిగా అవకాశం కల్పించాడు.. అలానే మిగతా హీరోలు కూడా ఛాన్సెస్ ఇస్తున్నారు అని వెల్లడించాడట. వెంకీమామ సమయంలో వెంకటేష్ గారి నుండి జీవితానికి సంబంధించి చాలా విషయాలు నేర్చుకున్నానని.. ముఖ్యంగా ఫ్యామిలీ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ ఎలా బాలన్స్ చేయాలో తెలుసుకున్నాని చెప్పుకొచ్చాడట. కరోనా లాక్ డౌన్ వల్ల తన కూతురితో ఎక్కువ సమయం గడిపే ఛాన్స్ దొరికిందని తెలిపాడట.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home