కార్తికేయ 2: లొకేషన్స్ వేట యమా జోరుగా ఉందే!

0

టాలెంటెడ్ ఫిలింమేకర్ గా పేరు తెచ్చుకున్న చందు మొండేటి ‘కార్తికేయ’ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించే ప్రయత్నాలలో ఉన్న సంగతి తెలిసిందే. ఒరిజినల్ లో నటించిన యువ హీరో నిఖిల్ సీక్వెల్ లో కూడా హీరోగా నటిస్తున్నాడు. ఈమధ్యే ‘కార్తికేయ 2’ సినిమా కాన్సెప్ట్ టీజర్ ను విడుదల చేసి అందరిని ఆకట్టుకున్నారు. తాజాగా ఈ సినిమా నుండి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది.

‘కార్తికేయ 2’ సినిమా ఒక డివోషనల్ టచ్ తో సాగే న్యూ ఏజ్ థ్రిల్లర్. కాన్సెప్ట్ టీజర్ లో ఇదే విషయం వెల్లడించారు. ద్వాపర యుగాంతంలో మరుగుపడిపోయిన ఒక రహస్యం.. ఆ సీక్రెట్ కోసం కలియుగం లో కొందరు ప్రయత్నించడం అనేది ఆసక్తికరం. ఈ సినిమాకు దేవాలయాల నేపథ్యం ఉండడం తో కథకు అనుగుణంగా ఉండే లొకేషన్స్ కోసం దర్శకుడు చందు ప్రస్తుతం వెతుకుతున్నారట. ఈ విషయం తెలుపుతూ నిర్మాతలు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు తమ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా చందు మొండేటి ఫోటోలను షేర్ చేశారు.

ఈ ఫోటోలలో ఒక్క మొక్క కూడా కనిపించని ప్రదేశంలో చందూ స్టైల్ గా నిలుచుని హీరోలాగా పోజిచ్చాడు.. ఒక ఫోటో వెనుక నుంచి తీయగా సిలౌట్ లాగా ఉంది. ఈ ఫోటోలో డైరెక్టర్ తో పాటుగా సూర్యుడు కూడా హ్యాండ్సమ్ గా కనిపించడం విశేషం. మరో ఫోటోలో సూర్యుడు లేకుండా డైరెక్టర్ గారు కూలింగ్ గ్లాసెస్ తో మరో ఝకాస్ పోజిచ్చారు. ఏదేమైనా లొకేషన్ మాత్రం కిరాకు.. అదిరింది అంతే. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ… అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-