బాలయ్య నిజంగానే ‘మోనార్క్’గా రానున్నాడా..?

0

నటసింహం బాలకృష్ణ లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత అభిమానులను వరుస ప్లాప్ సినిమాలతో నిరాశపరుస్తునే ఉన్నాడు. డిక్టేటర్.. లయన్.. పైసావసుల్.. ఎన్టీఆర్ కథానాయకుడు మహానాయకుడు మరియు రూలర్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరంగా బోల్తా కొట్టాయి. కానీ బాలయ్య క్రేజ్ మాత్రం ఇంచు కూడా తగ్గలేదు. ప్రస్తుతం బాలయ్య బోయపాటి శ్రీను దర్శకత్వంలో మూడో సినిమా చేస్తున్నాడు. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన సింహా లెజెండ్ సినిమాలు మంచి విజయం సాధించటంతో ఈ సినిమాపైన భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్నమైన పాత్రలలో కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఆల్రెడీ బాలయ్య పుట్టినరోజున విడుదల చేసిన టీజర్ కి రెస్పాన్స్ అదిరిపోయింది. సింహ లెజెండ్ సినిమాల లాగే బాగా పవర్ ఫుల్ గా ఈ మూడో సినిమా ఉండబవుతుంది అని మొన్నామధ్యన వదిలిన టీజర్ తో అర్ధమైంది. టీజర్ చూసిన ప్రతీ ఒక్కరు బాలయ్య ఈసారి రికార్డు బద్దలు కొడతాడని అంటున్నారు. బిబి3 టీజర్ చూసాక ఖచ్చితంగా సింహ లెజెండ్ లను మించిన హిట్ కొడతారని అభిమానులు నమ్మకంగా ఉన్నారు. అయితే ఈ సినిమాలో బాలయ్య అఘోర పాత్రలో కూడా నటిస్తున్నాడట.

అఘోర పాత్ర ఈ సినిమాలో కొంత నిడివి ఉంటుందని ఇప్పటికే బోయపాటి చెప్పాడు. అసలు బాలయ్యను ఎవరు ఊహించని అఘోర పాత్రలో చూపిస్తా అంటున్నాడు బోయపాటి. ఇంతలో ఈ సినిమా టైటిల్ ఇదే అంటూ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదే మోనార్క్. అయితే మోనార్క్ అనేది పరిశీలనలో మాత్రమే ఉంది. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరి బాలయ్య అఘోరగా మారడానికి అసలు కథనం ఏంటని ప్రేక్షకులలో ఆసక్తి నెలకొంది. ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నాడు.
Please Read Disclaimer