ప్రెస్ మీట్ లో దర్శకుడు కామెడీ చేశాడెందుకో ?

0

కొన్ని సందర్భాల్లో సినిమా ప్రెస్ మీట్ లో కొందరు నిర్మాతలు దర్శకులు నటులు తమ స్పీచ్ లతో కామెడీ పండిస్తుంటారు. కొందరు స్పీచ్ లతోనే కాదు వింత చేష్టలతో కూడా నవ్విస్తుంటారు. తాజాగా ‘ఊల్లాల ఊల్లాల’ అనే సినిమా ప్రెస్ మెట్ లో అదే జరిగింది. చిత్ర దర్శకుడు ఒకప్పటి నటుడు సత్య ప్రకాష్ తన కామెడీతో అందరికీ నవ్వుతెప్పించాడు.

తాజాగా ఈ సినిమా టీజర్ లాంచ్ మీడియా సమక్షంలో జరిగింది. సురేందర్ రెడ్డి లాంచ్ చేసి టీంకి ఆల్ ది బెస్ట్ చెప్పాడు. నిర్మాతతో పాటు టీమ్ కూడా సినిమా గురించి ఏవో రెండు ముక్కలు మాట్లాడారు. ఇక దర్శకుడి టైం వచ్చేసరికి మీడియాను తనకి వేదిక మీద ఎక్కువ ప్లేస్ కావాలని రిక్వెస్ట్ చేసాడు. తను వేదికను ఎంత వరకూ వాడుకోవచ్చంటూ అడిగి తెలుసుకున్నాడు. అలా అడిగే సరికి సత్య ప్రకాష్ ఏం చేయబోతున్నాడో అంటూ రిపోర్టర్లందరూ అతన్నే చూడసాగాడు.

ఇక వెంటనే మైక్ చేత్తో పట్టుకొని వేదిక మీద ఉన్న టీమ్ అలాగే సురేందర్ రెడ్డి చుట్టూ ఓ మూడు సార్లు తిరుగుతూ ‘ఊల్లాల ఊల్లాల’ సూపర్ హిట్ అంటూ పదే పదే చెప్పాడు. ఇక ఈ దర్శకుడు కం నటుడి చేష్టలకు అక్కడి వారందరూ నవ్వుకున్నారు. మరి ప్రెస్ మీట్ లో సినిమా గురించి ఏదో రెండు ముక్కలు చెప్పకుండా ఇలా రౌండ్స్ వేసి రిలీజ్ కి ముందే సూపర్ హిట్ అంటూ అరవడం ఏమిటో సత్య ప్రకాష్ కే తెలియాలి.
Please Read Disclaimer