‘ఆహా’ కోసం రంగంలోకి దిగబోతున్న మహేష్ డైరెక్టర్

0

అల్లు అరవింద్ సారధ్యంలో సాగుతున్న ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ ఇతర ఓటీటీ లకు గట్టి పోటీ ఇవ్వడంలో వెనుకబడ్డట్లుగా అనిపిస్తుంది. దాంతో పలు వెబ్ సిరీస్ లను మరియు కొన్ని వెబ్ మూవీస్ లను నిర్మించేందుకు అల్లు అరవింద్ నిర్ణయించుకున్నాడు. అందుకోసం పలువురు ఫేమస్ దర్శకులు మరియు నటీనటులతో చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం హీరోయిన్ తమన్నా ను ఆహా వెబ్ సిరీస్ కోసం సంప్రదించారట. అందుకు ఆమె కూడా ఓకే చెప్పిందనే వార్తలు వస్తున్నాయి.

తాజాగా ప్రముఖ దర్శకుడిని వెబ్ సిరీస్ కు అల్లు అరవింద్ ఒప్పించాడట. మహేష్ బాబుతో సూపర్ హిట్ మూవీని తెరకెక్కించిన ఆ దర్శకుడు ప్రస్తుతం తదుపరి చిత్రాన్ని మొదలు పెట్టలేదు. తదుపరి చిత్రానికి కనీసం ఆరు నెలలు అయినా సమయం పట్టే అవకాశం ఉంది. కనుక ఆయనతో వెబ్ సిరీస్ ను తీయాలని అల్లు అరవింద్ తీవ్రం గా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆయన ఇప్పటికే ఆహా కోసం ఒక వెబ్ సిరీస్ ను తెరకెక్కించేందుకు ఓకే చెప్పాడట.

అల్లు అరవింద్ అడిగిన తర్వాత ఏ దర్శకుడు అయినా కాదంటారా. ఆయన కూడా ఓకే చెప్పాడు. ఇప్పటి వరకు ఫ్లాప్ అనేది చవి చూడని ఆ దర్శకుడు స్క్రిప్ట్ కు తుది మెరుగులు అద్దుతున్నాడు. త్వరలోనే షూటింగ్ ను మొదలు పెట్ట బోతున్నాడట. ఈ వెబ్ సిరీస్ కోసం నిర్మాత అల్లు అరవింద్ కూడా భారీ గానే ఖర్చు పెట్టేందుకు సిద్దం గా ఉన్నాడట. త్వర లో పూర్తి వివరాలు వెళ్లడయ్యే అవకాశం ఉంది.
Please Read Disclaimer