ఒక దర్శకుడికి 48 అసిస్టెంట్లా?

0

మాములుగా చిన్న రేంజ్ అయినా పెద్ద స్థాయి అయినా ప్రతి దర్శకుడికి ఒక టీం ఉంటుంది. అందులో అసిస్టెంట్ డైరెక్టర్ల పాత్ర చాలా కీలకం. ఒకరకంగా చెప్పాలంటే వీళ్ళు రెండో కన్ను లాంటి వాళ్లన్న మాట. వీళ్ళ ప్రాధాన్యం పని ఆ లెవెల్ లో ఉంటాయి కాబట్టే ఇటీవలే ఓ స్టార్ హీరో ఏడితో గొడవ పడితే ఏకంగా షూటింగ్ క్యాన్సిల్ అయ్యే దాకా వచ్చింది పరిస్థితి. తర్వాత ఇద్దరికే సర్దిచెప్పి రాజీ కుదిర్చారు అది వేరే విషయం.

మాములుగా అసిస్టెంట్ డైరెక్టర్ల సంఖ్య 3 నుంచి 5 లేదూ మహా అయితే 8 దాకా ఉంటుంది. అలాంటిది ఓ డైరెక్టర్ కు 48 అసిస్టెంట్లు ఉన్నారంటే నమ్మగలమా. కాని ఇది నిజమట. తమిళ దర్శకుల్లో హరికి స్పెషల్ ఇమేజ్ ఉంది. ఊరమాస్ పోలీస్ కథలతో ప్రేక్షకులకు గూస్ బంప్స్ హీరోలకు బ్లాక్ బస్టర్స్ ఇవ్వడంలో ఇతను నేర్పరి. ఈయన తీసేవన్నీ ఎక్కువగా లాంగ్ షాట్స్ ఉంటాయి. ఓ రెండు మూడు కిలోమీటర్లు చేజులు ఫైట్లు మాములే. ఏదైనా షాట్ మొదలుపెడితే అది పూర్తయ్యే దాకా అదో పెళ్లి సందడి సినిమాలాగా ఉంటుందట.

ఒక్కసారి ఈ అసిస్టెంట్ డైరెక్టర్లు అందరూ గుంపుగా వస్తే ఎక్కడికో నిరసన తెలిపేందుకు వెళ్తున్నారన్న తరహాలో కనిపిస్తుందట. నిర్మాతతో ఒప్పందంలో వీళ్ళకు సంబంధించిన ఖర్చులన్నీ హరి ముందే చెప్పెస్తారట. కాకపోతే మరీ బరువు అనిపించకుండా ఉన్న బడ్జెట్ లోనే సర్దేలా ప్లాన్ చేస్తారట. దీని వల్ల ఒకేసారి ఇంత మందికి ఉపాధితో పాటు హరి లాంటి దర్శకుడి దగ్గర పని చేశామన్న పేరు వస్తుంది కాబట్టి ఈయన పద్ధతిని అందరు మెచ్చుకుంటున్నారట. ఇది హరి స్వయంగా చెప్పిన ముచ్చట కాదు కాని ఇంత పెద్ద టీం ని పెట్టుకోవడం ఏమో కాని మైంటైన్ చేయడం అసలైన సవాల్
Please Read Disclaimer