ప్రతిరోజు పండగే.. ఇదీ కథ అంటోన్న మారుతి

0

కెరీర్ ఆరంభంలో బూతు చిత్రాల దర్శకుడు అంటూ పేరు పొందిన దర్శకుడు మారుతి మెల్ల మెల్లగా ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడు. భలే భలే మగాడివోయ్.. మహానుభావుడు వంటి విభిన్నమైన చిత్రాలను తెరకెక్కించి ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసిన మారుతి ప్రస్తుతం మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తో ‘ప్రతి రోజు పండుగే’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

సినిమాపై ఉన్న ఆసక్తి నేపథ్యంలో సినిమా కథను ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు ఊహించేసుకుంటున్నారు. సినిమా టీజర్ మరియు ఇతర వీడియోలను బట్టి కథను విశ్లేషించే పనిలో పడ్డారు. విదేశీ కుర్రాడు అయిన హీరో తండ్రిని తాతను కలిపేందుకు పల్లెటూరుకు వస్తాడని.. ఇంకా రకరకాలుగా కథలు వినిపిస్తున్నాయి. పాత కథలనే కొత్తగా చూపించేందుకు మారుతి ప్రయత్నిస్తున్నాడంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై మారుతి స్పందించాడు.

ప్రతి రోజు పండుగే సినిమా కథలు అంటూ సోషల్ మీడియాలో ప్రసారం జరుగుతున్న వాట్లో ఏ ఒక్కటి నిజం కాదన్నాడు. ఒక మనిషి పుట్టుకను జనాలు ఎలా అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నారో అలాగే చనిపోయినప్పుడు కూడా ఆ మనిషికి సెండాఫ్ ఇస్తూ సెలబ్రేట్ చేసుకోవాలనేదే ఈ సినిమా మెయిన్ స్ట్రీమ్. ఇలాంటి స్టోరీ లైన్ తో ఇప్పటి వరకు సినిమా రాలేదని ఈ కథకు చిరంజీవితో పాటు చాలా మంది ప్రముఖులు కనెక్ట్ అయ్యారంటూ మారుతి చెప్పుకొచ్చాడు. తప్పకుండా సినిమా ఒక మంచి విజయాన్ని అందుకుంటుందనే నమ్మకంను మారుతి వ్యక్తం చేశాడు.
Please Read Disclaimer