మెగా హీరో పంచ్ కు మారుతి కౌంటర్!

0

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్.. రాశి ఖన్నా హీరో హీరోయిన్లుగా మారుతి దర్శకత్వంలో ‘ప్రతిరోజూ పండగే’ చిత్రం తెరకెక్కుతోంది. రాశి ఖన్నా పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుండి కాసేపటి క్రితం ‘తకిట తకిట’ అనే లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు. అంతే కాదు రాశి పుట్టినరోజు సందర్భంగా తేజు బర్త్ డే విషెస్ తెలుపుతూ రాశిపై ఒక పంచ్ వేయడం.. వెంటనే దర్శకుడి మారుతి మెగా హీరోపై పంచ్ వేయడం నెటిజన్ల దృష్టిని ఆకర్షించాయి.

తేజు తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసి “జన్మదిన శుభాకాంక్షలు రాశి ఖన్నా జీ. ముందు చెయ్యి తియ్యి అమ్మా. మీ ఫ్యాన్స్ నన్ను అరుస్తున్నారు #హాథ్ నికాలో #చెయ్యి తీ #సోలో బ్రతుకే సో బెటర్” అంటూ ట్వీట్ చేశాడు. ఈ ఫోటోలో తేజు చేతిని రాశి ప్రేమగా పట్టుకుంది. తేజు నెక్స్ట్ సినిమా సోలో బ్రతుకే సో బెటర్ కాబట్టి ఆ సినిమాకు ప్రమోషన్ అన్నట్టుగా తేజు ఇలా పంచ్ వేయడం ఫన్నీగానే ఉంది. అయితే వెంటనే దర్శకుడు మారుతి మరోరెండు ఫోటోలు ఈ ట్వీట్ కు రిప్లై గా పోస్ట్ చేసి “ఇక్కడ చెయ్యి వేసింది ఎవరు డార్లింగ్ #ప్రతిరోజూ పండగే”అంటూ ట్వీట్ చేశాడు. ఈ ఫోటోలో మన మెగా హీరో ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా రాశి ఖన్నాగారిని అక్కున చేర్చుకుని ప్రేమగా లాలిస్తున్నాడు. అంటే ‘జోడీ బ్రతుకే సో బెటర్’ అని ఒప్పుకున్నట్టేగా!

ఇంతటితో సంవాదం ఆగలేదు సుమా. అక్కడ ఉండేది మెగా మేనల్లుడు కదా. ఏమీ తెలియని ఆమయక చక్రవర్తి లాగా “మీరు యాక్షన్ చెప్పారు నేను చెయ్యి వేశాను అండీ” అంటూ రిప్లై ఇచ్చాడు. మొత్తానికి బర్త్ డే రాశి ఖన్నాది అయినప్పటికీ ‘ప్రతిరోజూ పండగే’ ప్రమోషన్ కోసం ఫుల్ గా వాడుకున్నారు. ఎంతైనా మెగా హీరో.. డైరెక్టర్ కదా. సినిమా విడుదలయ్యే లోపు ఇలాంటి చిలిపి పంచులు ఇంకా ఎన్ని ఉంటాయో వేచి చూడాలి.
Please Read Disclaimer