నాగేశ్వర రెడ్డి.. నిర్మాత ఓకే – హీరో ఎవరు?

0

‘తెనాలి రామకృష్ణ ఎల్ ఎల్ బీ’ సినిమాతో ఇటీవలే ప్రేక్షకులను పలకరించాడు దర్శకుడు నాగేశ్వరరెడ్డి. కామెడీ సినిమాల రూపకల్పనలో సీనియర్ అయిన ఈ దర్శకుడు తన తాజా సినిమాతో సరైన హిట్ అయితే అందుకోలేకపోయాడు. హీరో క్యారెక్టరైజేషన్ ను అటు కామెడీగానూ చూపించక – ఇటు మాస్ హీరోగానూ చూపించకుండా మిక్డ్స్ గా వెళ్లడం సరిగా లేదని ఆ సినిమా విషయంలో రివ్యూయర్లు తేల్చారు.

అదే సినిమాను అల్లరి నరేష్ ను హీరోగా పెట్టి… ఫుల్ లెంగ్త్ కామెడీగా తీసి ఉంటే ఆకట్టుకునేదనే అభిప్రాయాలు వినిపించాయి. ఆ సంగతలా ఉంటే.. నాగేశ్వర రెడ్డి ఇంతలోనే మరో సినిమాను అనౌన్స్ చేశాడు. ఈ కొత్త సినిమాకు నిర్మాత కూడా ఓకే అయ్యారట.

ఇటీవలే విశాల్ సినిమా ‘యాక్షన్’ను తెలుగులో విడుదల చేసిన ఆడెపు శ్రీనివాస్ నిర్మాణంలో నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారట. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన సినిమాలు అంటే ఇష్టమని – ఆయనతో ఆ తరహా సినిమా ఒకటి చేయనున్నట్టుగా నిర్మాత ప్రకటించారు.

ఇలా నిర్మాత – దర్శకుడు ఓకే అయ్యారట ఈ కొత్త సినిమాకు. ఇందులో హీరో ఎవరు? హీరోయిన్ – సాంకేతిక బృందం ఎవరనే విషయాల గురించి త్వరలోనే పూర్తి వివరాలను ప్రకటిస్తారట.
Please Read Disclaimer