మహేష్ వివాదం .. పూరి అలా స్కిప్

0

ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ నేపథ్యంలో పూరి- ఛార్మి బృందం ఇరు తెలుగు రాష్ట్రాల్లో సక్సెస్ టూర్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇస్మార్ట్ శంకర్ మాస్ లో పెద్ద హిట్ అయ్యింది. మ్యాడ్ నెస్ క్రియేట్ చేసిందంటూ పూరి ప్రచారం చేస్తున్నారు. సిద్ధిపేట్.. కర్నూల్ .. అనంతపురం తిరిగాం. విజయవాడ వచ్చాం. వైజాగ్ వరకూ టూర్ వెళతామని మీడియాకు తెలిపారు. ఇక ఆయన ఎక్కడికి వెళ్లినా మహేష్ పై కామెంట్ గురించే ప్రశ్నిస్తోంది మీడియా.

మహేష్ ఓన్లీ హిట్టు సినిమా దర్శకులతోనే పని చేస్తారనన్న వ్యాఖ్య పూరీని వెంటాడుతూనే ఉంది. విజయవాడ సక్సెస్ మీట్ లోనూ ఈ వివాదంపై ప్రశ్న ఎదురైంది. అయితే ఆ ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు పూరి ఆసక్తి చూపించలేదు. “ఆల్రెడీ ట్రోల్ అవుతోంది.. దానిని ఎందుకు పెంట చేయడం? ఆ విషయాలు ఇప్పుడు వద్దు“ అంటూ స్కిప్ కొట్టేశారు. ఇంకా కెలకడం ఎందుకు? అన్న ఉద్ధేశాన్ని కనబరిచారు. ఇటీవలే ఓ టీవీ చానెల్ ఇంటర్వ్యూలోనూ పూరి ఇదే విధంగా మహేష్ వివాదంపై మాట్లాడేందుకు ఆసక్తి కనబరచలేదు.

సక్సెస్ సెలబ్రేషన్స్ గురించి ముచ్చటిస్తూ.. తెలుగు రాష్ట్రాల్లో అన్ని నగరాల్లో పర్యటిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం నిధి అగర్వాల్ ప్రచారంలో పాల్గొంటోంది. త్వరలో నభా కూడా మాతో చేరుతుంది. ఈసారి రామ్ మిస్సయ్యాడు అని వెల్లడించారు. మాస్ పొటెన్షియల్ ఏమిటో చెప్పిన సినిమా ఇది. సక్సెస్ కంటే మ్యాడ్ నెస్.. క్రేజ్ క్రియేట్ చేసింది. యూత్ పాటలు.. డైలాగ్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇలాంటి సినిమాలు ఇంకా తీస్తాను అని పూరి అన్నారు. మొత్తానికి మహేష్ తో వివాదంపై మాట్లాడేందుకు మాత్రం పూరి ససేమిరా అనేస్తున్నాడు. స్కిప్ కొట్టేస్తున్నాడు ఇప్పటికి.
Please Read Disclaimer