కీలక సమయంలో తంబీని ఆశ్రయించాడు!

0

వెర్సటైల్ స్టార్ శర్వానంద్ కి సక్సెస్ లేక దాదాపు మూడేళ్లవుతుంది. వైవిధ్యం ఉన్న స్క్రిప్టుల్ని ఎంచుకున్నా నేరేషన్ పరంగా నీరసం రప్పించడంలో దర్శకులు పోటీపడ్డారని విమర్శలొచ్చాయి. ఇక మారుతి దర్శకత్వంలో వచ్చిన `మహానుభావుడు` యావరేజ్ ఫలితం అందుకుంది. ఆ తర్వాత చేసిన `పడి పడి లేచే మనసు`.. `రణరంగం`… ఇటీవల విడుదలైన `జాను` బ్యాక్ టూ బ్యాక్ శర్వాని పెవీలియన్ కి పంపాయి. తాజాగా ఆయన కిశోర్ రెడ్డి దర్శకత్వంలో `శ్రీకారం` చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో ఆయన చదువుకున్న రైతుగా కనిపించబోతున్నాడు. వ్యవసాయం గొప్పతనం చెప్పే ప్రయత్నం చేస్తున్నాడట. మరోవైపు `కీరవాణి` అనే చిత్రం కూడా చేయబోతున్నట్టు వార్తలొచ్చాయి. ఇదే కాకుండా ఇటీవల ఆయన కిశోర్ తిరుమల దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు సైన్ చేశారు. దిల్ రాజు నిర్మించే ఈ సినిమాని ఇటీవలే ప్రకటించిన విషయం విదితమే.

అయితే మరోసారి శర్వా తమిళం- తెలుగు ద్విభాషా చిత్రానికి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. కొరియోగ్రాఫర్ కం ఆల్ రౌండర్ రాజు సుందరం మాస్టర్ డైరెక్షన్ లో ఓ సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడట. రాజు సుందరం 2008లో అజిత్ హీరోగా `ఆయిగన్` సినిమాని రూపొందించగా.. అది ఆశించిన ఫలితాన్నివ్వలేదు. దీంతో మళ్ళీ దర్శకత్వం వైపు చూడలేదు. తాజాగా దాదాపు 12ఏళ్ళ తర్వాత మరోసారి దర్శకత్వం చేసేందుకు సిద్ధమవుతున్నారట. ఇటీవల ఈ డాన్స్ మాస్టర్ చెప్పిన కథ నచ్చడంతో శర్వానంద్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇది ద్విభాషా చిత్రమని కోలీవుడ్ టాక్.

అయితే శర్వా డబుల్ లాంగ్వేజ్ స్టింట్ ఏమంత ఆశాజనకంగా అయితే లేదు. ఇప్పటికే శర్వానంద్ `గమ్యం`.. `రాజాధిరాజా` వంటి బైలింగ్వల్ చిత్రాల్లో నటించిన విషయం విదితమే. పొరుగు భాషల్లో ఆశించినంత హిట్లు అయితే కావు. ఇక దాదాపు నాలుగేళ్ల తర్వాత మళ్ళీ ద్విభాషా చిత్రానికి ప్లాన్ చేయడం విశేషం. తెలుగులో వరుస ఫ్లాపుల్లో ఉన్న శర్వాకి ఇలాంటి కీలక సమయంలో తమిళ తంబీ అయినా ఓ హిట్ ఇస్తాడేమో చూడాలి. అన్నీ కుదిరితే ఈ సినిమా మేలో ప్రారంభం కానుందట.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-