Templates by BIGtheme NET
Home >> Cinema News >> హీరోయిన్ తో ఎఫైర్ వార్తలపై స్పందించిన దర్శకుడు రవిబాబు..!

హీరోయిన్ తో ఎఫైర్ వార్తలపై స్పందించిన దర్శకుడు రవిబాబు..!


సినీ పరిశ్రమలో రూమర్స్ అనేవి సర్వసాధారణం. ఏ ఇద్దరు వ్యక్తులు చనువుగా ఉన్నా వారి మధ్య ఏదో వ్యవహారం నడుస్తుందని పుకార్లు పుట్టుకొస్తుంటాయి. హీరో హీరోయిన్లు కలిసి రెండు సినిమాలు చేసినా.. దర్శకుడు ఒకే హీరోయిన్ తో ఎక్కువ సినిమాలు చేసినా వారిద్దరి మధ్య ఏదో ఉందని గాసిప్స్ వస్తుంటాయి. కొంతమంది వీటిని ఏమాత్రం పట్టించుకోకుండా వదిలేస్తారు. మరికొందరు మాత్రం ఇలాంటి రూమర్స్ తో ఇబ్బంది పడుతూ వాటిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారు.

ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకోవలసి వచ్చిందంటే.. టాలీవుడ్ డైరెక్టర్ రవిబాబు – హీరోయిన్ పూర్ణ మధ్య అఫైర్ ఉందని అప్పట్లో పుకార్లు షికారు చేసాయి. వరుసగా రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ‘అవును’ ‘అవును 2’ ‘లడ్డుబాబు’ వంటి చిత్రాల్లో పూర్ణ లీడ్ రోల్ లో నటించడమే ఈ వార్తలు గుప్పుమనడానికి కారణమయ్యాయి. పూర్ణ తో రవిబాబు కు ఎఫైర్ ఉందని సోషల్ మీడియా లో హల్ చల్ చేసిన వార్తలపై రవిబాబు స్పందించారు. వాటిలో ఎలాంటి నిజం లేదని.. తనపై వచ్చిన రూమర్స్ అన్నీ అబద్దాలే అని అన్నారు.

ఇటీవల రవిబాబు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ”షూటింగ్ అయిపోయాక హీరోయిన్ తో మాట్లాడడం కానీ.. వారికి ఫోన్ చేయడం కానీ జరగదు. సినిమా పుర్తయ్యాక వారెవరో నీనెవెరో అన్నట్టుగానే ఉంటాను. నేను ఎథిక్స్ వాల్యూస్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తిని. కేవలం పూర్ణ అభినయం చూసే మూడు సినిమాల్లో తీసుకున్నాను. అయినా నేను వారిని వేధించేవాడినైతే వారు మళ్లీ నాతో సినిమాలు ఎందుకు తీస్తారు” అని రవిబాబు చెప్పుకొచ్చారు.

ఇక సినిమాల విషయానికొస్తే.. రవిబాబు ఇటీవల ”క్రష్” అనే యూత్ ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ తో పలకరించాడు. కొత్త నటీనటులతో రూపొందించిన సినిమా జీ5 లో డైరెక్ట్ ఓటీటీ విధానంలో విడుదల అయింది.