డైరెక్టర్ వెంటపడి మరీ ఒప్పించాడట

0

దాదాపు దశాబ్ధం పాటు రాజకీయాల్లో తలమునకలుగా ఉన్న విజయశాంతిని తెలుగు.. తమిళంలో ఎంతోమంది దర్శకులు నటించాల్సిందిగా సంప్రదించినా ససేమిరా అన్నారు. అయితే ఎఫ్ 2 దర్శకుడు అనీల్ రావిపూడి తనకి ఏం చెప్పి ఒప్పించగలిగారు? అంటే లేడీ సూపర్ స్టార్ విజయశాంతి స్వయంగా ఆ సీక్రెట్ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఓపెనయ్యారు.

ఈ దశాబ్ధ కాలంలో ఎందరో దర్శకులు నా వెంట పడ్డారు. సినిమాల్లో నటించాల్సిందిగా అడిగారు. కానీ నేను అంగీకరించలేదు. అందరు దర్శకుల్లానే .. అనీల్ రావిపూడి ఎప్పటి నుంచో నన్ను నటించాల్సిందిగా సంప్రదించారు. నేను రకరకాల వ్యాపకాల్లో బిజీగా ఉన్నప్పుడు ఏదో సినిమా గురించి చెప్పాడు. అప్పట్లో నటించను అని చెప్పాను. చూద్దాం ఆ ఆలోచన వస్తే అని తిరస్కరించాను. కానీ ఆయన విడిచి పెట్టలేదు. మళ్లీ మళ్లీ అప్రోచ్ అయ్యారు. గత ఎన్నికలు జరుగుతున్న సమయంలో నన్ను కలిసి ఒకసారి కథ వినండి నచ్చితే చేయండి.. అని అన్నారు. ఎన్నికలు అయిపోయాక ఫ్రీ అవుతాను. నచ్చితే చేస్తాను. నచ్చకపోతే చేయను. తప్పుగా అనుకోకండి అన్నాను. ఆ తర్వాత కథ విన్నాను. కథలో కామెడీ బాగా ఎంజాయ్ చేశాను. నవ్వి నవ్వి కడుపు నొప్పి వచ్చేంతగా నవ్వాను. నా పాత్ర గురించి మళ్లీ విన్నాను. బావుంది అన్నాను. బావుంది అన్న తర్వాత చేయాల్సిందే. రిజెక్ట్ చేయడం తప్పు అవుతుందని ఓకే చెప్పాను. నా రీఎంట్రీకి ఇది కరెక్ట్ గా ఉంటుంది అనిపించి ఓకే చెప్పాను.. అని విజయ శాంతి తెలిపారు.

ఒక సూపర్ స్టార్ నటిస్తున్న సినిమాలో ఫీమేల్ కి ఇంత మంచి పాత్ర ఉండడం రేర్. నేను హీరోలతో చేసేప్పుడు వేరు. ఇప్పుడు వేరు. ఇప్పటి జనరేషన్ దర్శకులు డిఫరెంటుగా వెళుతున్నారు. ఇలాంటి టైమ్ లో ఒక హీరో సినిమాలో నా పాత్ర ఇలా కుదరడం అరుదు అనే చెప్పాలి. హుందాగా ఉండే పాత్ర ఇది. మిమ్మల్ని దృష్టి లో పెట్టుకునే ఈ పాత్రను రాశానని అనీల్ అన్నారు. అందుకే నటించాను.. అని తెలిపారు. సరిలేరు నీకెవ్వరు సెట్స్ నుంచి సూపర్ స్టార్ మహేష్ .. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కాంబినేషన్ సీన్స్ కి సంబంధించిన ఫోటోలు ఇప్పటికే వైరల్ అయ్యాయి. వీటికి ఫ్యాన్స్ నుంచి అద్భుత స్పందన వస్తోంది. ఈ చిత్రం లో విజయశాంతి భారతి అనే లేడీ ప్రొఫెసర్ గా నటిస్తున్నారు. మహేష్ ఆర్మీ మేజర్ గా నటిస్తూనే డిఫరెంట్ షేడ్ తో ఆకట్టుకోనున్నారు. 2020 సంక్రాంతికి సినిమా రిలీజవుతున్న సంగతి తెలిసిందే.
Please Read Disclaimer