రాజమౌళి తర్వాత అతడేనా..సురేందర్ సత్తా ఎంత..?

0

తెలుగు దర్శకుల్లో అగ్రస్థానం ఎవరి అంతే మరోమాట లేకుండా రాజమౌళి అనే చెప్పాలి. అపజయం అనేది ఎరగని డైరెక్టర్ గా, అంతర్జాతీయ స్థాయి సినిమా తీసిన దర్శకుడిగా రాజమౌళికి అగ్రతాంబూలం ఇవ్వలసిందే, అయితే అతని తర్వాత స్థానం ఎవరిదీ అనే విషయంలో ఒక క్లారిటీ లేదు, కొరటాల శివ, త్రివిక్రమ్, సుకుమార్ లాంటి వాళ్ళు పోటీపడుతున్నారు. తాజాగా వాళ్ళకి గట్టి పోటీ ఇవ్వటానికి సురేందర్ రెడ్డి వచ్చాడు.

ధృవ సినిమాతో తానేంటో నిరూపించుకున్న సురేందర్ రెడ్డి, తాజాగా వచ్చిన సైరా సినిమాతో ఒకేసారి పదిమెట్లు ఎక్కాడు. ఇలాంటి రా ఫుటేజీ కలిగిన కథని తీసుకోని ఎక్కడ కూడా చరిత్ర దాటి పోకుండా అదే సమయంలో సినిమాకి కావలసిన హంగులను అందులో జొప్పించి కథని తయారుచేసి, దానిని అంతే బ్యాలన్సుడ్ గా సినిమా తీసి అందరి చేత శబాష్ అనిపించుకోవడం అనేది మాములు విషయం కాదు.

ఈ ఒక్క సినిమాతో సురేందర్ రెడ్డి పాన్ ఇండియా సినిమా డైరెక్టర్ లిస్ట్ లోకి వెళ్ళిపోయాడు. రాజమౌళి, శంకర్ లాంటి ఇద్దరు ముగ్గురు దర్శకులు మాత్రమే పాన్ ఇండియా లిస్ట్ లో ఉన్నారు. సైరా సినిమాతో సురేందర్ అక్కడ స్థానం సంపాదించుకున్నాడు. అయితే ఒక్క సినిమాతో వచ్చిన దానిని అలాగే కాపాడుకోవటంలోనే అసలైన పరీక్ష ఉంటుంది. తర్వాతి తీయబోయే సినిమా కూడా ఇంతే స్థాయిలో కాకపోయినా పాన్ ఇండియా సబ్జెక్టు తీసుకోని సినిమా తీసి విజయం సాధిస్తే మరో మాట లేకుండా రాజమౌళి తర్వాతి స్థానం సురేందర్ రెడ్డిదే అని చెప్పవచ్చు.
Please Read Disclaimer