తేజ ఎవరిని కామెంట్ చేసాడబ్బా!

0

ఇండస్ట్రీలో మాటలతో కుండబద్దలు కొట్టే దర్శకులు కొందరే. అందులో తేజ ఒకరు. మాట్లాడటం చేత కాదంటూనే ఆయన శైలిలో పంచ్ వేస్తుంటాడు ఈ దర్శకుడు. అయితే ఇటివలే ఉత్తేజ్ యాక్టింగ్ ఇన్ స్టిట్యూట్ ఈవెంట్ లో మరో సారి యంగ్ హీరోలపై సెటైర్ వేసాడు తేజ. నటనలో కొన్ని మెళకువలు చెప్తూ ఓ సందర్భంలో మెగా స్టార్ రిఫ్లెక్టర్ గురించి రియాక్ట్ అయిన విధానం చెప్తూ చిరు గొప్పదనం తెలియజేసాడు.

ఇక చిరు గొప్పదనం చెప్తూ ఊరికే మెగాస్టార్ అయిపోలేదు. ఆయనే కాదు సూపర్ స్టార్ అనిపించుకున్న అమితాబ్ కూడా ఇప్పటికీ నటనలో ఏదొకటి నేర్చుకుంటారని చెప్పాడు. ఒక షూటింగ్ ఆయనకీ సీన్ లేనప్పటికీ వేరే నటుడి నటన చూస్తూ తను కూడా ప్రాక్టీస్ చేసారని చెప్తూ ఇక ఇప్పుడున్న కొందరు హీరోలు క్యార్ వ్యాన్ దిగరని కామెంట్ చేసాడు.

నిజానికి తేజ అన్నదాంట్లో నిజం లేకపోలేదు. ఇప్పుడున్న హీరోలు షూటింగ్ లో ఎక్కువగా కష్టపడకుండా మిగతా క్రాఫ్ట్స్ గురించి అలాగే ఇతర నటీ నటుల సీన్స్ గురించి తెలుసుకోకుండా పుట్టుకతోనే క్యార్ వ్యాన్ వాడినట్లుగా బ్రేక్ దొరికితే అందులో దూరిపోతారు. మరి తేజ ఏ హీరోలను దృష్టిలో పెట్టుకొని ఇలా కామెంట్ చేసారో.
Please Read Disclaimer