మా బావ ఎనర్జీని ఎవ్వరూ మ్యాచ్ చేయలేరు: వి.వి.వినాయక్

0

మాస్ మహారాజా రవితేజను ‘బావ’ అని సంబోధించారు ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్. ‘డిస్కోరాజా’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన రవితేజపై ప్రశంసల వర్షం కురిపించారు. ‘‘మా బావ రవితేజ మాస్ మహారాజా. ఆయన ఎనర్జీతో ఎవరూ మ్యాచ్ అవ్వలేరు. ఈ సినిమా టీజర్‌లో గన్ పట్టుకుని భలే చేశాడు’’ అని రవితేజ గురించి మాట్లాడుతూ అన్నారు.

రవితేజ, నభా నటేష్, పాయల్ రాజ్‌పుత్, తాన్య హోప్ హీరోహీరోయిన్లుగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘డిస్కోరాజా’. సాయి రిషిక సమర్పణలో ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈనెల 24న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రచారంలో భాగంగా ఆదివారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ వేడుకలో వి.వి.వినాయక్ పాల్గొన్నారు.

‘‘డైరెక్టర్ ఆనంద్ తన తొలి సినిమా నుంచి నాకు తెలుసు. నా మనసుకు బాగా దగ్గరైన వ్యక్తి. చాలా మంచి డైరెక్టర్. ఈ సినిమాకు టైటిల్ ‘డిస్కోరాజా’ అని చాలా బాగా పెట్టాడు. అది రవితేజకు కరెక్ట్‌గా సరిపోతుంది. నిర్మాత రామ్ తాళ్లూరి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను చాలా ప్యాషన్‌గా తీశారని టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఇక మా బావ రవితేజ, మాస్ మహారాజా.. తన ఎనర్జీతో ఎవరూ మ్యాచ్ అవ్వలేరు’’ అని అన్నారు వి.వి.వినాయక్.

ఈ సినిమా తప్పకుండా పెద్ద విజయాన్ని అందుకుని టెక్నీషియన్స్ అందరికీ మంచి పేరు రావాలని వినాయక్ అన్నారు. డైరెక్టర్ ఆనంద్‌కి ఇది కెరీర్‌లో చాలా పెద్ద సినిమా కావాలని కోరుకున్నారు. ‘‘బావ రవితేజ.. నువ్వింకా రాలేదు. సారీ, నేను బయలుదేరుతున్నాను’’ అని తన ప్రసంగాన్ని ముగించారు వినాయక్. దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కుతోన్న సినిమాలో వినాయక్ హీరోగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వినాయక్ ఆ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.
Please Read Disclaimer