సాహో లో ప్రభాస్ వాడిన బ్లూటూత్ గురించి మీకు తెలియని సీక్రెట్స్!!

కలెక్షన్స్ కోసం డిస్కోరాజా ‘చిరు’ ప్రయత్నం

0

రవితేజ హీరోగా విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘డిస్కోరాజా’ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. నభా నటేష్.. పాయల్ రాజ్ పూత్ లు హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రంను ప్రేక్షకులు తిరష్కరించారు. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ చిత్రం ఆ అంచనాలను అందుకోవడం లో నిరాశ పర్చింది. మొదటి రెండు మూడు రోజులు ఒక మోస్తరుగా కలెక్షన్స్ వచ్చినా కూడా బ్రేక్ ఈవెన్ కు చాలా దూరంలో ఈ చిత్రం ఉంటున్నట్లుగా సమాచారం అందుతోంది.

ఇలాంటి సమయంలో సినిమాను ప్రమోట్ చేసేందుకు… ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేందుకు చిత్ర యూనిట్ సభ్యులు ఇంకా కష్టపడుతూనే ఉన్నారు. సినిమాలో ఉన్న ఒక మెగాస్టార్ సీన్ ను ప్రోమోగా కట్ చేసి సోషల్ మీడియాలో వదిలారు. మెగా ఫ్యాన్స్ దృష్టిని ఆకర్షించేందుకు వారిని థియేటర్లకు రప్పించే ఉద్దేశ్యం తో డిస్కో రాజా మెగాస్టార్ సీన్ ను వాడేసుకున్నాడు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ ప్రయత్నం ఎంత వరకు వర్కౌట్ అయ్యేనో చూడాలి.

డిస్కోరాజా చిత్రంలో రవితేజ రెండు విభిన్న పాత్రలు చేశాడు. విభిన్నమైన కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కినా కూడా స్క్రీన్ ప్లే మాత్రం ఆకట్టుకోలేక పోయింది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. రివ్యూలు కూడా స్క్రీన్ ప్లే బాగాలేదని.. సునీల్ ను విలన్ గా చూపించి నవ్వులపాలయ్యారు అంటూ విమర్శలు వస్తున్నాయి. మొత్తానికి డిస్కోరాజాతో పునర్ వైభవంను దక్కించుకోవాలనుకున్న రవితేజ కు నిరాశే మిగిలింది. ఇప్పుడు చేస్తున్న చిరు ప్రయత్నం తో అంత పెద్ద నష్టాన్ని పూడ్చగలరా అనేది అనుమానమే.
Please Read Disclaimer