డిస్కో రాజా ఫస్ట్ లుక్

0

మాస్ మహారాజా రవితేజ హీరోగా విఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న డిస్కో రాజా ఫస్ట్ లుక్ ని ఇండిపెండెన్స్ డే సందర్భంగా విడుదల చేశారు. మొహాన్ని చూపించకుండా కేవలం బ్యాక్ షాట్ నుంచి రివీల్ చేసే తీరు చూస్తుంటే ఏదో సస్పెన్స్ థ్రిల్లర్ లాగా కనిపిస్తోంది. క్యాప్షన్ లో రివైండ్ ఫార్వార్డ్ ని అని పెట్టి మధ్యలో ప్లేని కొట్టేసి చివరిలో కిల్ ని హై లైట్ చేయడం చూస్తుంటే హీరో పాత్ర ఏదో సీరియస్ రివెంజ్ డ్రామాను ప్లే చేసినట్టు కనిపిస్తోంది.

ఫాంటసీ జోనర్ లో ఉండొచ్చని ఇంతకు ముందే లీక్ వచ్చింది. దానికి బలం చేకూరేలా పోస్టర్ కూడా ఉండటంతో అభిమానుల్లో కూడా ఉత్సాహం కలిగేలా ఉంది. గత ఏడాది చేసిన మూడు సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో రవితేజ మంచి కసిమీదున్నాడు. ఒక్క క్షణం తర్వాత విఐ ఆనంద్ కూడా డిస్కో రాజా కోసమే ఎక్కువ గ్యాప్ తీసుకున్నాడు. అందుకే కొంత ఆలస్యం అవుతున్నా ఇద్దరూ ఫోకస్ మొత్తం దీని మీదే పెట్టారు.

ఈ సంవత్సరమే విడుదల అయ్యే డిస్కో రాజా డేట్ ఇంకా లాక్ చేయలేదు. షూటింగ్ మొత్తం పూర్తయ్యాక అప్పుడు ఒక నిర్ణయానికి వస్తారు. నభ నటేష్ – పాయల్ రాజ్ పుత్ – తాన్య హోప్ హీరొయిన్లుగా నటిస్తున్న డిస్కో రాజా మీద ఫ్యాన్స్ అంచనాలు భారీగా ఉన్నాయి. కార్తీక్ ఘట్టమనేని ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ మూవీకి తమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు
Please Read Disclaimer