డిస్కో రాజా డేట్ ఫిక్స్ అయ్యాడా ?

0

గత ఏడాది ఒకటి కాదు ఏకంగా మూడు డిజాస్టర్లతో మార్కెట్ ని బాగా రిస్క్ లో పడేసుకున్న మాస్ మహారాజా రవితేజ కొత్త సినిమా డిస్కో కింగ్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లో జరుగుతోంది. త్వరలో కీలకమైన పార్ట్ కోసం ఢిల్లీ వెళ్లనుంది యూనిట్. ఆ మధ్య కొంత గ్యాప్ వచ్చినప్పటికీ ఆ తర్వాత నిరవధికంగా షూట్ లో ఉన్న డిస్కో రాజా ముందు దసరా లేదా దీపావళికి ప్లాన్ చేద్దాం అనుకున్నారు.

కానీ ఆ లోగా మొత్తం పూర్తి చేసి ఫస్ట్ కాపీ రెడీ చేసే అవకాశాలు లేకపోవడంతో ఇప్పుడు డిసెంబర్ 20 మీద కన్నేసినట్టు సమాచారం. ఇప్పుడున్న స్పీడ్ తో కచ్చితమైన ప్లానింగ్ తో వెళ్తే అదేమీ కష్టం కాదు. అందుకే లాక్ చేసుకుని త్వరలో ప్రకటించే దిశగా చర్చలు జరుగుతున్నాయట. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అదే తేదీ కోసం మరో ఇద్దరు హీరోలు పడుతున్నట్టుగా మరో సమాచారం

నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతున్న భీష్మను అదే టైంలో తీసుకువచ్చే దిశగా ఆలోచిస్తున్నట్టుగా టాక్ ఉంది. సాయి తేజ్ హీరోగా మారుతీ డైరెక్షన్ లో రూపొందుతున్న ప్రతిరోజు పండగే సైతం ఆ డేట్ నే టార్గెట్ చేసుకున్నట్టు వినికిడి. ఇవి డిసెంబర్ నే లక్ష్యంగా పెట్టుకోవడానికి కారణం ఉంది. అప్పటికి ఇంకో ఇరవై రోజుల గ్యాప్ లో సంక్రాంతి వచ్చేస్తుంది.

ఇప్పటికే మహేష్ బాబు – అల్లు అర్జున్ – రజిని కాంత్ బరిలో దిగేందుకు గ్రీన్ సిగ్నల్స్ ఇచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఎవరు ఆ సీజన్ జోలికి వెళ్లే ఛాన్స్ లేదు. అందుకే కొంచెం మంచి రన్ తో పాటు ఓపెనింగ్స్ రావాలంటే డిసెంబర్ మిడిలే బెస్ట్. మరి ఈ ముగ్గురిలో ఎవరు ఉంటారు ఎవరు డ్రాప్ అవుతారు అని తేలడానికి ఇంకొంచెం టైం అయితే పడుతుందిPlease Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home