రేణుక కోసం రాంగోపాల్ వర్మ ఫండ్ రైజింగ్

0

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా కూడా విభిన్నంగా ఉంటుంది. హైదరాబాద్ లో జరిగిన దిశ సంఘటన దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయిన విషయం తెల్సిందే. అంతటి వివాదాస్పద విషయమై సినిమా తీయబోతున్నట్లుగా వర్మ ప్రకటించిన విషయం తెల్సిందే. దిశ నిందితుల్లో ఒక్కడైన చెన్న కేశవులు భార్య రేణుకను ఆమద్య ఇంటర్వ్యూ చేసిన వర్మ ఆమెకు చాలా ఎక్కువ పబ్లిసిటీ దక్కేలా చేశాడు. తాజాగా మరోసారి ఆమె గురించి ట్వీట్ చేశాడు.

చెన్న కేశవులు ఎన్ కౌంటర్ అయిన సమయంలో రేణుక గర్భవతి అనే విషయం తెల్సిందే. తాజాగా రేణుక పాపకు జన్మనిచ్చింది. రేణుక ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్న కారణంగా ఆ పాపను పెంచి పోషించేందుకు రేణుకకు ఆర్థిక సాయం చేయాలంటూ ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని వర్మ మొదలు పెట్టాడు. రేణుక గురించి అంతగా తాపత్రయ పడుతున్న వర్మను చూసి అంతా అవాక్కవుతున్నారు.

రేణుకకు ఆమద్య తానే స్వయంగా ఆర్థిక సాయంను ప్రకటించిన వర్మ ఈసారి అకౌంట్ నెంబర్ ఇచ్చి మరీ ఆమెకు సాయం చేయాల్సిందిగా పిలుపునివ్వడం కాస్త విడ్డూరంగా ఉంది అంటూ నెటిజన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వర్మ ఎందుకు ఆమెపై అంతగా శ్రద్ద చూపిస్తున్నాడంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి వర్మ సాయంతో రేణుక ఆర్థికంగా ఇబ్బంది లేకుండా జీవితాన్ని ముందుకు నడిపించుకునే స్థాయికి చేరినట్లుగా ఆమె సన్నిహితులు చెబుతున్నారు. రేణుక మరియు ఆమె పాప ఫొటోను వర్మ సోషల్ మీడియా ద్వారా షేర్ చేశాడు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-