మలంగ్.. వైల్డ్ కిస్సిస్తున్న పటాని!

0

ఆదిత్య రాయ్ కపూర్.. దిశా పటాని హీరో హీరోయిన్లు గా నటిస్తున్న బాలీవుడ్ చిత్రం ‘మలంగ్’. అనిల్ కపూర్.. కునాల్ ఖేము ఈ సినిమా లో ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమా కు మోహిత్ సూరి దర్శకత్వం వహిస్తున్నారు. ‘మర్డర్ 2’.. ‘ఆషికి 2’.. ‘ఏక్ విలన్’ చిత్రాలకు దర్శకుడి నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఫిబ్రవరి 7 న రిలీజ్ కానుంది. దీంతో ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.

తాజాగా ఈ సినిమా నుండి ట్రైలర్ రిలీజ్ డేట్ వెల్లడిస్తూ ఒక పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్ ను తన ఇన్స్టా ఖాతా ద్వారా షేర్ చేసిన దిశ “2 వైల్డ్ గా ఉండే ఆత్మలు.. ఒక ప్రేమ.. మలంగ్. జనవరి 6 న ట్రైలర్ రానుంది” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇక పోస్టర్ గురించి చెప్పాలంటే.. బాలీవుడ్ ఎక్కడికో వెళ్లిపోతున్నట్టుగా ఉంది. బీచ్ ఒడ్డున నిలుచున్న ఆదిత్య.. భుజాలపై రసగుల్లా లాంటి దిశ. అసలే దిశా హాటు. ఆరడుగుల అందగాడికి జిమ్నాస్టిక్ స్టైల్ లో ఒక మ్యాజికల్ కిస్ ఇచ్చింది. పోస్టర్ లో కళాత్మకత.. కొత్తదనం కొట్టొచ్చినట్టు కనపడుతోంది. దిశా ఎప్పటి లాగే మిల్లీ మీటర్ల లెంగ్త్ ఉన్న ఒక డెనిమ్ మైక్రో ధరించి మోడరన్ బ్యూటీలా ఉంది. ఇక ఆదిత్య హాలీవుడ్ యాక్షన్ హీరోలా కనిపిస్తున్నాడు. ఈ కిస్సును చూస్తుంటే కొంతకాలం ‘జలేబీ’ సినిమా పోస్టర్లో ట్రైన్ విండో నుంచి వేలాడుతూ రివర్స్ లో హీరోయిన్ హీరో కు ఇచ్చే మరో జిమ్నాస్టిక్ ముద్దు గుర్తుకు రావడం ఖాయం.

దిశా మామూలుగానే ఇన్స్టాగ్రామ్ లో తన ఇన్నర్ వేర్లతో రచ్చ లేపుతూ ఉంటుంది. ఇప్పుడేమో మలంగ్ పోస్టర్ తో సంచలనం సృష్టించింది. పోస్ట్ చేసి గంటే అయింది కానీ లక్షలకొద్దీ లైకులు వచ్చాయి. అలియా భట్ లాంటి బ్యూటీలు కూడా ఈ కిస్సుకు ఫిదా అయి లైక్స్ కొట్టారు. “షాందార్ చుమ్మా”.. “పోస్టర్ అఫ్ ది డెకేడ్” అంటూ నెటిజన్లు సూపర్ కామెంట్లు పెడుతున్నారు. అంతా బాగానే ఉంది. పుసుక్కున ఎగ్జైట్ అయ్యి ఇట్టాంటి కిస్సులు ట్రై చెయ్యకండి. ఇలాంటి చెయ్యాలంటే జిమ్నాస్టిక్స్ తెలిసి ఉండాలి.. నిపుణుల పర్యవేక్షణలో చెయ్యాలి. పాపం.. ఆ సూచన పోస్టర్ లో పొందుపరచలేదు. తస్మాత్ జాగ్రత్త!
Please Read Disclaimer