ఇలియానా ఫీచర్స్ ఉండీ ఏం లాభం?

0

లాక్మే ఫ్యాషన్ వీక్ 2019 సెలబ్రేషన్స్ గురించి తెలిసిందే. వారం పదిరోజుల పాటు ముంబై నగరం ఈ ప్రత్యేకమైన ఈవెంట్ తో ధగధగలాడుతోంది. బాలీవుడ్ అగ్ర కథానాయికలు.. టాప్ మోడల్స్ ఈ ఈవెంట్ లో రెడ్ కార్పెట్ నడకలతో అదరగొడుతున్నారు. కత్రిన- కరీనా కపూర్- లీసా హెడెన్ వంటి టాప్ హీరోయిన్లు లాక్మే ఫ్యాషన్ వీక్ లో కనిపించారు. ఫర్హాన్ అక్తర్- శిబానీ దండేకర్.. అర్జున్ కపూర్ .. ఆయుష్మాన్ ఖురానా.. జహాన్ కపూర్ లాంటి స్టార్లు రెడ్ కార్పెట్ నడకలతో మైమరిపించారు. టాలీవుడ్ టాప్ బ్యూటీ పూజా హెగ్డే సైతం లాక్మే వీక్ లో అదరగొట్టిన సంగతి తెలిసిందే.

తాజాగా లోఫర్ బ్యూటీ దిశా పటానీ వంతు. కెల్విన్ క్లెయిన్ బ్రాండ్ అంబాసిడర్ గా దిశాకి ఉన్న ఫాలోయింగ్ తెలిసిందే. తాజాగా లాక్మే ఫ్యాషన్ వీక్ 2019లోనూ దిశా తళుకుబెళుకులు హైలైట్ గా నిలిచాయి. మిరుమిట్లు గొలిపే మెరుపుల (షిమ్మరీ) డ్రెస్ లో దిశా ఇచ్చిన ఫోజులు ఈ వేదికకే హైలైట్ గా నిలిచాయి. బూడిద రంగు డిజైనర్ డ్రెస్ .. బ్రౌన్ కలర్ హెయిర్ కాంబినేషన్ సంథింగ్ స్పెషల్ గా హైలైట్ అయ్యింది. మరోవైపు లాక్మే వీక్ షో స్టాపర్స్ గా పలువురు బాలీవుడ్ డెబ్యూ నాయికలు తళుకుబెళుకులు ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సదరు అందాల నాయికల ఫోటోలు వీడియోలు వెబ్ లో వైరల్ గా మారాయి.

దిశా కెరీర్ మ్యాటర్ పరిశీలిస్తే.. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో `లోఫర్` చిత్రంలో నటించింది ఈ అమ్మడు. ఆ తర్వాత పూర్తిగా బాలీవుడ్ కే అంకితమైంది. చాలా కాలం తర్వాత తిరిగి దిశా టాలీవుడ్ లో అడుగు పెట్టనుందన్న వార్తలు వస్తున్నాయి. అల్లు అర్జున్ సరసన దిశా నటించనుందని ప్రచారం సాగుతోంది. ఇలియానా తర్వాత మళ్లీ అంతటి అందచందాలు ట్యాలెంట్ ఉన్న నటిగా దిశా పేరు ప్రస్తుతం మార్మోగుతోంది. అయినా ఈ అమ్మడు ఎందుకనో ఇంకా టాప్ రేంజుకు చేరలేకపోయింది. బాలీవుడ్ లో చాలా నెమ్మదిగా కెరీర్ ని సాగించడం ఆశ్చర్యకరం. ఇలియానా ఫీచర్స్ ఉండీ ఏం లాభం? తనంత స్థాయిని అందుకోలేకపోతోందిగా అంటూ యూత్ సెటైర్లు వేస్తున్నారు.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home