బ్యూటిఫుల్ బాడీ బిల్డర్

0

దిశా పటాని పేరుకు అసలేమాత్రం ఇంట్రో అవసరం లేదు. కాల్విన్ క్లెయిన్ బ్రాండ్ అంబాజిడర్ గా దిశా ఖ్యాతి నలుదిశలా వ్యాపించింది. ఎన్నో సినిమాల్లో నటించి.. అవార్డులను ఎడాపెడా కొనుక్కునే జనాలకు కూడా రాని గుర్తింపు ఇన్నర్ వేర్ బ్రాండ్ ప్రమోషన్స్ ద్వారా సాధించింది. దిశా కూడా హీరోయిన్ గా కొన్ని సినిమాల్లో నటించింది కానీ హీరోయిన్ గా వచ్చిన గుర్తింపు కంటే బికినీ పాపగా వచ్చిన గుర్తింపు ఎక్కువ.

దిశాకు ఇన్స్టాలో 24 మిలియన్ల ఫాలోయర్లు ఉన్నారు. దిశ ఎప్పుడు ఫోటో పోస్ట్ చేస్తుందా అని అందరూ చకోరపక్షుల్లా ఎదురుచూస్తుంటారు. వారికోసమే దిశా రెగ్యులర్ గా ఫోటోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా మరో హాట్ ఫోటో షూట్ కు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో క్రీమ్ కలర్ ప్యాంట్.. వైట్ కలర్ టాప్ ధరించింది. అయితే ఎక్కడా బ్రాండ్ పేరు మాత్రం లేదు. కాల్విన్ క్లెయిన్ తో కటీఫ్ చెప్పిందేమో మరి. ఒక ఫోటోలో వెనకవైపుకు తిరిగి బాహుబలి స్టైల్ లో కండల ప్రదర్శన చేస్తోంది. ఈ ఫోటోకు “నిన్నటి కంటే ఈరోజు మెరుగ్గా ఉండండి” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫోటోలలో యాక్సెసరీస్ ధరించలేదు కానీ ఒక చేతికి మాత్రం సింగిల్ బ్యాంగిల్ ధరించింది.

ఈ ఫోటోలకు నెటిజన్ల స్పందన అదిరిపోయింది. పోస్ట్ చేసిన రెండు గంటల్లోనే ఫోటోలకు ఆరు లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. ఈ ఫోటోలకు టైగర్ ష్రాఫ్ ఒక లైక్ వేసుకున్నాడు. ‘ఎందుకు?’ అని అడిగితే టైగర్ గారు దిశాగారి బాయ్ ఫ్రెండ్ అని బాలీవుడ్ మీడియావారు చెవులు కొరుక్కుంటూ ఉంటారని.. అలా చేసి చేసి వారికి సగం చెవులు లేకుండా పోయాయని చెప్పాల్సి ఉంటుంది. ఈ ఫోటోలకు నెటిజన్లు భలే కామెంట్లు పెట్టారు.. “బ్యూటిఫుల్ బాడీ బిల్డర్”.. “మస్క్యులార్.. స్పెక్టాక్యులర్”.. “టైగర్ తో ఫ్రెండ్షిప్ ఎఫెక్ట్ ” అంటూ రెచ్చిపోయారు. దిశా సినిమాల విషయనికి వస్తే ‘మలంగ్’ అనే చిత్రంలో నటిస్తోంది.
Please Read Disclaimer