మరోసారి సీకేకి సినిగిపోయిందిగా

0

2018 దీపావళి మొదలు సీకే బ్యూటీ దిశా పటానీ ట్రీట్ అవిరామంగా .. అన్ లిమిటెడ్ గా సాగుతున్న సంగతి తెలిసిందే. దీపావళి రోజు దీపం వెలిగిస్తూ సీకే లోదుస్తులతో తళుక్కుమంది. ఇదేంటి దనలక్ష్మి ఇలాంటి రూపంలో ప్రత్యక్షమైంది!! అంటూ అభిమానులు షాక్ తిన్నారు. అయితే ఆ తర్వాత ఇదంతా కెల్విన్ క్లెయిన్ పబ్లిసిటీ స్టంట్ అని తెలిసి నాలుక్కరుచుకోవడం అందరి వంతు అయ్యింది. టైమ్ చూసి తడాఖా చూపించిన దిశాకు ఓవర్ నైట్ ఇన్ స్టాలో అసాధారణ ఫాలోయింగ్ పెరిగింది.

ప్రస్తుతం దిశాను లక్షలాది మంది ఇన్ స్టా సహా సామాజిక మాధ్యమాల్లో అనుసరిస్తున్నారు అంటే అది సీకే బ్రాండ్ పుణ్యమే. ఇక ఈ బ్రాండ్ తో దిశా భారీ ఒప్పందమే చేసుకుందన్న సమాచారం ఉంది. అయితే బ్రాండ్ అంబాసిడర్ అంటే ఏదో రెండు మూడు సార్లు అలా లోదుస్తుల ప్రచారంతో సరిపెట్టేస్తే కుదురుతుందా? కొత్త మోడల్ మార్కెట్లో దిగే ముందే పబ్లిసిటీ అవసరం. అందుకే ప్రతిసారీ ఈ బ్రాండ్ లోదుస్తులతో ఈ అమ్మడు ప్రత్యక్షమవుతోంది.

మరోసారి సీకే బ్రాండ్ తో కుర్రాళ్ల ముందు ప్రత్యక్షమైందిలా. ఈసారి మునుపటితో పోలిస్తే ఇంకాస్త డోస్ పెంచినట్టే కనిపిస్తోంది. దిశా దెబ్బకు సీకే బ్రాండ్ కి సినిగిపోయింది. బ్లాక్ టాప్ లోంచి దిశా అందాలు సంథింగ్ స్పెషల్ గా ట్రీటిస్తున్నాయి. ఇక బాటమ్ లో ఆ రెడ్ కలర్ లోవర్ టైట్ కట్ లుక్ అంతే హాట్ గా దర్శనమిస్తోంది. అన్నిచోట్లా సీకే బ్రాండ్ ప్రమోషన్ మోతెక్కిపోతోంది. పర్ఫెక్ట్ టోన్డ్ బాడీతో దిశా ఇస్తున్న ట్రీట్ నభూతోనభవిష్యతి. ప్రస్తుతం ఈ హాట్ ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది. దిశా ప్రస్తుతం పలు క్రేజీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. బ్లాక్ బస్టర్ సిరీస్ భాఘి పార్ట్ 3కి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే.
Please Read Disclaimer