బ్రాండ్ మార్చిన పటాని పాప?

0

బాలీవుడ్ హాటు పాపలకు కొదవ లేదనే సంగతి తెలిసిందే. అయితే హాట్ 2.0 అనే తరహాలో రెచ్చిపోతున్న భామ మాత్రం దిశా పటాని. పూరి జగన్నాధ్ ‘లోఫర్’ తో వెండితెరకు పరిచయం అయిన ఈ భామకు తన బికినీలతో సోషల్ మీడియాను షేక్ చేయడం ఒక హాబీ. ఇలాంటి హాటు హాబీని వెంటనే గుర్తించిన కాల్విన్ క్లెయిన్ వారు బ్రాండు అంబాజిడర్ హోదాను కల్పించారు. ఏ అంబాజిడర్ కాకపోతేనే రెచ్చిపోయే భామకు.. ఫీజు ఇచ్చి హోదా ఇస్తే ఊరుకుంటుందా? జింతాత జిత జిత మొదలెట్టింది. నెటిజన్లతో చెడుగుడు ఆడుకుంటోంది.

అయితే ఈ భామ తాజాగా అందరికీ షాక్ ఇస్తూ ఒక ఫోటో పోస్ట్ చేసింది. నెటిజన్లు షాక్ అయిన అంశం ఏంటంటే ఆమె ఘాటు అందాలు కాదు. ఆమె కాల్విన్ క్లెయిన్ కు బదులుగా అడిడాస్ ప్యాంట్ వేసుకోవడం. మరి ఊరికే అలా ధరించిందా.. లేక కాల్విన్ క్లెయిన్ వారిని “నాకు రెమ్యూనరేషన్ పెంచకపోతే ఇలా చాలా బ్రాండ్లు ఉన్నాయి… జాబ్ మారతాను అని బెదిరించడమా?” ఈ విషయంపై త్వరలోనే మనకు క్లారిటీ వస్తుంది లెండి. అయితే యధావిధిగా తన ట్రేడ్ మార్క్ ఫోటోల రేంజ్ తగ్గదు అన్నట్టుగా అందాలను ఆరెంజ్ టాప్ లో వడ్డించింది.

ఎప్పటి లాగే ఈ ఫోటోకు భారీగా లైకులు వచ్చాయి. నాలుగు గంటల్లో 1.27 మిలియన్ లైక్స్. బాలీవుడ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్ ఈ ఫోటోకు ఒక లైక్ వేసుకున్నాడు. ఇక సాధారణ నెటిజన్లు తమ కామెంట్లవర్షం కురిపించారు. “అడిడాస్ కు మారిపోయావా?”.. “బ్రాండు ముఖ్యమా.. బ్యూటీ ముఖ్యమా?”.. “ఎప్పటిలాగే సూపర్ పోజు” అంటూ కామెంట్లు పెటారు. దిశా సినిమాల విషయనికి వస్తే ‘మలంగ్’ అనే చిత్రంలో నటిస్తోంది. మొహిత్ సూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆదిత్య రాయ్ కపూర్.. అనిల్ కపూర్.. కునాల్ ఖేము ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Please Read Disclaimer