ఇది యూ నెక్ బికినీ!

0

ట్రెండ్ ను సృష్టించే వారు వేరు.. గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఆ ట్రెండ్ ను ఫాలో అయ్యేవాళ్లు వేరు. బాలీవుడ్ భామ.. టాలీవుడ్ ‘లోఫర్’ బ్యూటీ దిశా పతాని మొదటి రకం. ఎలాగంటారా? సోషల్ మీడియాను విచ్చలవిడిగా వాడి బీచ్.. బికినీ అనే పదాలు వినగానే దిశా పతాని పేరు గుర్తొచ్చేలా చేసుకుంది. దీంతో ఇన్నర్ వేర్ బ్రాండ్ అయిన కాల్విన్ క్లెయిన్ వారి కళ్ళలో పడింది. ఇంకేముంది.. ఏం లేకుండానే స్పైసీ టైటిల్స్ తో రచ్చ చేసే యూట్యూబ్ ఛానల్ వాడికి ఏకంగా యమా స్పైసీ వీడియో ఎక్స్ క్లూజివ్ గా దొరికినట్టయింది.

ఆ బ్రాండ్ ఇన్నర్ వేర్ ధరించడం హాట్ ఫోటోషూట్ల లో పాల్గొనడం.. ఇదే పని. మధ్యలో గ్యాప్ దొరికితే సినిమాలు చేస్తుంది. అలా ఉంది వరస. తాజాగా మరోసారి తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు “హలో.. ఎండాకాలం #కాల్విన్ క్లెయిన్” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇక ఫోటో విషయానికి వస్తే సైడ్ యాంగిల్ లో ఓ డార్క్ కలర్ బికినీలో సెక్సీ పోజిచ్చింది. ఫ్రంట్ సహజంగా డీప్ వీ నెక్ ఉంటుంది.. కానీ ఇదేం బ్రాండో గానీ రెచ్చిపోయి మరీ యూ నెక్ డిజైన్ చేశారు. సరిగ్గా సైడ్ యాంగిల్ లో డీప్ యూ నెక్ కనిపించేలా ఫోటో తీయడంతో యమా సెక్సీ గా ఉంది. ఫేస్ లో ఆ ఎక్స్ ప్రెషన్ ఎలా ఉందంటే ఖజురహో శిల్పానికి ప్రాణం వస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. మినిమమ్ మేకప్ తో.. మ్యాగ్జిమం అందాల ప్రదర్శనతో వేసవికి గ్రాండ్ వెల్కమ్ చెప్పింది. కనీసం ఈ దెబ్బకు పది డిగ్రీలయినా వేడి పెరిగి ఉంటుంది.

దిశా సినిమాల విషయానికి వస్తే సల్మాన్ ఖాన్ తాజా చిత్రం ‘భరత్’ లో ఒక హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా కాకుండా ‘మలంగ్’ అనే మరో చిత్రంలో కూడా నటిస్తోంది. ఆదిత్య రాయ్ కపూర్.. అనిల్ కపూర్.. కునాల్ ఖేము ఈ చిత్రంలో ఇతర ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.
Please Read Disclaimer