నిక్కరులో లోఫర్ దిశా

0

లోఫర్ బ్యూటీ దిశా పటానీ ఏం చేసినా సంథింగ్ స్పెషల్ అనే చెప్పాలి. ఫిజికల్ ఫిట్ నెస్ లో దిశా శ్రద్ధ గురించి ఇటీవల యువతరం ఎక్కువగా ముచ్చటించుకుంటున్నారు. పెర్ఫెక్ట్ టోన్డ్ బాడీని మెయింటెయిన్ చేస్తూ టైగర్ ష్రాఫ్ లాంటి మ్యాకో హీరోతో పోటీపడుతోంది. ఇక మార్షల్ ఆర్ట్స్ లోనూ దిశా పటానీ ఎక్స్ పర్ట్ అన్న సంగతి తెలిసిందే. రెగ్యులర్ గా కిక్ బాక్సింగ్ ను ప్రాక్టీస్ చేస్తుంది.

మరోవైపు ఫ్యాషన్ అండ్ ట్రెండ్స్ లో దిశా ఓ సంచలనం. ప్రఖ్యాత సీకే కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ గా దిశా ఇప్పటికే యూత్ లో పాపులరయ్యింది. మరోవైపు సోషల్ మీడియాలోనూ తనకు అద్భుతమైన ఫాలోయింగ్ ఉంది. రెగ్యులర్ గా ఈ అమ్మడు తన నిత్య వ్యాపకాల్ని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తుంటుంది. తను ఎక్కడికి వెళ్లినా అక్కడ ముంబై మీడియా వెంటాడుతూనే ఉంటుంది. తాజాగా దిశా ముంబై శాంటా క్రజ్ ఏరియాలో ఓ ఫుడ్ కోర్టుకు వెళ్లి వస్తున్నప్పటి క్యాజువల్ లుక్ ఫోటోల్ని మీడియా వైరల్ చేస్తోంది.

ఈ ఫోటోల్లో నిక్కరులో కనిపించింది దిశా. రెడ్ షార్ట్ .. వైట్ బనియన్ తో ఎంతో నేచురల్ గా అలా ఫుడ్ కోర్టుకి వెళ్లడంతో యువతరం అదే పనిగా తననే గమనించారు. ప్రతిసారీ టైట్ ఫిట్ జిమ్ డ్రెస్ లతో వేడెక్కించిన దిశా ఇలా కొత్త లుక్ లో కనిపించే సరికి ఆటవిడుపుగా భావించారనే అనుకోవాలి. ఇక కెరీర్ పరంగా చూస్తే.. సల్మాన్ భారత్ సినిమాలో నటించింది దిశా. ప్రస్తుతం మోహిత్ సూరి తెరకక్కించనున్న మళంగ్ అనే చిత్రంలోనూ నటించేందుకు రెడీ అవుతోంది. ఆదిత్య రాయ్ కపూర్- ఖునాల్ కీము-అనీల్ కపూర్ ఆ చిత్రంలో కథానాయకులుగా నటిస్తున్నారు.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home