దిశా ఇన్నర్ బ్యూటీ స్టన్నింగ్ పోజ్

0

బాలీవుడ్ లో బ్రాండ్ అంబాజిడర్లు ఎంతమంది ఉంటారు? వారందరూ ఎన్ని బ్రాండ్స్ ను ప్రమోట్ చేస్తుంటారు? ఒక్కో స్టార్ హీరోయిన్ ను తీసుకుంటే కనీసం అరడజను బ్రాండ్స్ వారి లిస్టులో ఉంటాయి. కానీ ఎవరైనా దిశా పటాని లాగా చేయగలిగారా? ఆమె ప్రమోషన్ చేస్తున్న బ్రాండ్ కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చేందుకు ఆరాటపడుతోంది. నిజానికి భూగోళం ఇప్పటికే కవర్ అయిపోయింది. ఇక ఇలానే కొనసాగితే గ్రహాంతరవాసుల్లో చలనం వచ్చి కాల్విన్ క్లెయిన్ బ్రాండ్ ఇన్నర్ వేర్ కొనుక్కుంటారు. ఇంతగా ఒక బ్రాండ్ ను పాపులర్ చేసినందుకు దిశా పటానిని ఐ.ఎస్.బీ వారు.. ఐఐఎం అహమదాబాద్ వారు కేస్ స్టడీగా తీసుకొని విద్యార్థులకు ఇన్నర్ సీక్రెట్లు వివరించాలి. బ్రాండ్ అంబాజిడర్ ఎలా ఉండాలి అనే విషయం దిశాను చూసే అందరూ తెలుసుకోవాలి!

ఇక్కడ మనం గమనిచాల్సిన విషయం ఏంటంటే ఇన్నర్ వేర్ కు బ్రాండ్ అంబాజిడర్ గా వ్యవహరించడం చాలామందికి నామోషీ.. కొందరికి ఎంబరాసింగ్ గా ఉంటుంది. కానీ దిశా మాత్రం దానిని ఒక యజ్ఞంలాగా.. పవిత్రమైన కార్యం లాగా చేపట్టి సోషల్ మీడియాను షేక్ చేసింది. ఆ బ్రాండ్ ప్రమోషన్లలో భాగంగా తాజాగా మారోసారి కాల్విన్ క్లెయిన్ టీ షర్ట్.. అండర్ వేర్ ధరించి ఓ మోడరన్ ఖజురహో శిల్పం లాంటి పోజిచ్చింది. ఒక తెల్లటి బెడ్ పై మోకాళ్ళపై వయ్యారంగా కూర్చుంది. దిశా కూర్చున్న పోజును జస్ట్ చూస్తేనే నెటిజనులకు 10000 వోల్టుల షాక్ తగిలేలా ఉంది. బ్లాక్ డ్రెస్ కావడంతో చాకొలేట్ కలర్ శరీర వర్ణం మరింతగా మెరిసిపోతూ ఉంది. ఫేషియల్ మేకప్ కూడా పర్ఫెక్ట్ గా ఉండడంతో ఇంటర్నేషనల్ మోడల్ లాగా కనిపిస్తోంది.

ఈ ఫోటో దెబ్బకు నెటిజనుల దిమాక్ ఖరాబ్ అయిపోయింది. జస్ట్ నాలుగు గంటల్లోనే 1.4 మిలియన్లకు పైగా లైకులు కొట్టి ఇన్నర్ వేర్ భామకు తమ జేజేలు తెలిపారు. ఫర్హాన్ అఖ్తర్ సాబ్ గారి గర్ల్ ఫ్రెండ్ షిబాని దండేకర్ కూడా ఫిదా అయ్యి రెండు ఫైర్ ఎమోజిలు పెట్టింది. ఇక సాధారణ నెటిజనులు “హాటెస్ట్ గర్ల్ ఇన్ ది వరల్డ్”.. “స్టన్నింగ్ & గార్జియస్”.. “బ్లాక్ ఇన్నర్ వేర్ ఈజ్ బ్యూటిఫుల్” అంటూ కామెంట్లు పెట్టారు. కానీ ఈ ఎక్స్ పోజింగ్ చూసి ఒకరికి కోపం వచ్చి “నువ్వు జన్మలో బాగుపడవు” అని కసురుకున్నాడు.
Please Read Disclaimer