బంతిపూల వనంలో చామంతి

0

లోఫర్ బ్యూటీ దిశా పటానీ ఏం చేసినా సెన్సేషనే. సినిమాల్ని మించి సోషల్ మీడియాతోనే సహజీవనం చేసే ఈ అమ్మడు ఆ వేదికపై భారీగానే ఆర్జిస్తోంది. కెల్విన్ క్లెయిన్ లోదుస్తుల ప్రచారం సహా పలు కార్పొరెట్ బ్రాండ్లకు సోషల్ మీడియాల్లో ప్రచారం చేస్తూ కోట్లలో ఆర్జిస్తోంది. ఫ్యాషన్ ప్రపంచంలో తనకంటూ ఓ రేంజ్ ఉందని నిరూపిస్తూ దిశా దూసుకుపోతోంది.

సినీకెరీర్ పరంగా చూస్తే.. ఎం.ఎస్.ధోని.. భాఘి 2.. భారత్ .. అన్నీ తనకు ఇమేజ్ పెంచినవే. ప్రస్తుతం మళంగ్ అనే మల్టీస్టారర్ లో నటిస్తోంది. ఇందులో ఆషికి 2 ఫేం ఆదిత్యా రాయ్ కపూర్ కథానాయకుడు. అనీల్ కపూర్ మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. దీంతో పాటు సల్మాన్ భాయ్ సరసన భారత్ తర్వాత రెండో ప్రాజెక్టుకు కమిటైంది. రాధే అనేది టైటిల్. 2020 ఈద్ కానుకగా ఈ చిత్రం రిలీజ్ కానుంది.

ఓవైపు సినిమాలతో బిజీగా ఉన్నా.. వీలున్నప్పుడల్లా సోషల్ మీడియాని ఫోటోషూట్లతో హీటెక్కిస్తోంది. ఇటీవలే సీకే బ్రాండ్ తో మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. బికినీ లుక్.. థై ఎగ్జిబిషన్ తో దిశా కుర్రాళ్లలో వేడి పెంచింది. అందుకు భిన్నంగా ఇదిగో ఇలా బంతిపూల వనంలో బాలామణిలా కొత్త లుక్ తో కనిపించింది. పూలవనంలో ఫ్లోరల్ డిజైనర్ డ్రెస్ తో దిశా ఫోటోలకు ఫోజిచ్చింది. పైగా సూర్యుని లేలేత కిరణాలు తనపై ప్రసరించి రిఫ్లెక్ట్ అవుతుంటే దిశా చిరునవ్వులు అంతే హైలైట్ గా కనిపిస్తున్నాయి.
Please Read Disclaimer