దిశా పటాని 2020 ట్రీట్

0

కొందరిని చూస్తే హోమ్లీ అని ఎందుకు అనిపిస్తుంది.. కొందరిని చూస్తే వెంటనే మనకు హాట్ అని ఎందుకు అనిపిస్తుంది? కొందరు ఫుల్లుగా డ్రెస్ వేసుకున్నా హాటుగా ఉంటారు.. కొందరేమో తమ డ్రెస్సుకు 70 % ఆషాఢం డిస్కౌంట్ ఇచ్చినా అస్సలు హాటుగా ఉండరు. కొందరికి శరీరం లోనే ఇన్ బిల్ట్ హాట్ నెస్ ఉంటుంది. అలాంటి భామలు ఏ డ్రెస్ వేసుకున్నా హాటే. ఆ హాట్ నెస్ లేనివారు బికినీ వేసుకున్నా వేస్టే. ఇక బాలీవుడ్ భామ దిశ పటానికి ఈ హాట్ నెస్ మిగతా వారికంటే డబల్ ఉంటుంది. డ్యూయల్ సిమ్ కార్డ్ మొబైల్ టైపు అన్నమాట.

దిశ ఒక్కసారి ఫోటో చేస్తే ఇన్స్టాగ్రామ్ కు వెన్నులో వణుకు పుడుతుంది. అలా షేక్ అవుతుంది సోషల్ మీడియా. ఏం సందర్భం లేకుండానే బికినీ పోజులిచ్చి జనాలను కాల్చుకు తినే పటాని న్యూ ఇయర్ అకేషన్ ను వదిలేస్తుందనుకోవడం మన భ్రమ. నిన్న తన ఇన్స్టా ద్వారా హాటు ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలకు “అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. దేవుడు మీ అందరిపై ప్రేమ కురిపించుగాక” అంటూ ఒక సింపుల్ క్యాప్షన్ ఇచ్చింది. దేవుడు కురిపిస్తాడో లేదు దేవుడెరుగు. పటాని మాత్రం హాటు ప్రేమ కురిపించింది. చిరుగులు ఉండే జీన్స్ ప్యాంట్.. టాప్ వేసుకోకుండా అందమైన ఇన్నర్ వేర్ ధరించి ఎప్పటిలాగే కత్తి లాంటి ఎక్స్ ప్రెషన్స్ తో పోజులిచ్చింది. కాస్త చిందరవందరగా ఉన్న హెయిర్ స్టైల్ తో మినిమమ్ మేకప్ తో.. మైకంలో ఉన్న నెటిజన్ల హృదయాలను టోకున కొల్ల గొట్టింది.

ఈ ఫోటోలకు వరుణ్ ధావన్ లాంటి బాలీవుడ్ హీరోలు కూడా లైక్స్ కొట్టారు. దాదాపు 2 మిలియన్ల లైక్స్ వచ్చాయి. ఇంట్రెస్టింగ్ కామెంట్లు కూడా పెట్టారు.. “ఒంటిపై టాప్ నిలవదే”.. “టైగర్ భాయ్.. నువ్వు లక్కీ”.. “హాటెస్ట్ న్యూ ఇయర్ ట్రీట్” అంటూ కొందరు కామెంట్లు పెట్టారు. దిశ సినిమాల విషయనికి వస్తే ప్రస్తుతం ‘మలంగ్’.. ‘రాధే’ సినిమాల్లో నటిస్తోంది.
Please Read Disclaimer