దిశా బికినీ.. నూట ఒకటోస్సారి!

0

స్టార్లు చాలామందే ఉంటారు కానీ మెగాస్టార్ ఒక్కరే. అలానే హాటు బ్యూటీలు చాలామందే ఉంటారు కానీ వారిలో హాటెస్ట్ సూపర్ స్టార్ ఎవరంటే దిశా పటాని. అనవసరంగా బాలీవుడ్ తోనే సరిపెట్టుకుంటుంది కానీ కాస్త గట్టిగా ట్రై చేస్తే ఈ పాప హాలీవుడ్ జనాలను కూడా డంగైపోయేలా ఖాయం. సరే.. పటాని మనసులో అలాంటి ఆలోచన ఉందో లేదో తెలియదు కానీ సోషల్ మీడియాలో నెటిజన్లను డీప్ ఫ్రై చెయ్యాలనే ఆలోచన మాత్రం ఉంది.

అందుకే తాజాగా ఈ భామ ఒక బికినీ ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు ప్రత్యేకంగా ఎటువంటి క్యాప్షన్ కూడా ఇవ్వలేదు కానీ ఒక సీతాకోకచిలుక ఎమోజి మాత్రం పెట్టింది. అంటే సీతాకోక చిలుక అంత అందం.. అంతకు మించిన స్వేచ్ఛ తనకు ఉందని చెప్తోందేమో. ఫోటోలో బికినీ ధరించి ఒక ఈతకొలను గట్టుమీద వయ్యారంగా కూర్చుంది. చీకటిలో లైట్ల వెలుగు నీడల్లో పటాని అంతః సౌందర్యం పూర్తిగా ఇనుమడించింది. బ్లాక్ అండ్ వైట్ పిక్ కావడంతో ఈ ఫోటో అందం మరింతగా పెరిగింది. మేడమ్ టుస్సాడ్స్ అని ప్రపంచంలో ఉన్న సెలెబ్రిటిల మైనపు బొమ్మలు పెడతారు. పటాని కోసం ‘మేడమ్ పటానిస్’ అనే ఒక పెద్ద మైనపు బొమ్మల మ్యూజియంను ముంబైలో ఏర్పాటు చెయ్యాలి. అందులో ఈ అంతః సౌందర్యాన్ని పూర్తిగా అవిష్కరించాలి. మ్యూజియం నిండా పాప బొమ్మలే.. అన్నీ బికినీలే ఉండాలి. అప్పుడే దశ దిశలా ఈ కళాత్మకత గురించి అందరికీ తెలుస్తుంది. ఎప్పుడూ ముష్టి వార్తలలో పడి మునిగితేలే బోరింగ్ జనాలకు కూసంత కలాపోసన అయినా అబ్బుతుంది.

ఎప్పటిలాగే ఈ ఫోటోకు నెటిజన్ల స్పందన అదిరిపోయింది. ఇప్పటి వరకూ ఈ ఫోటోకు 1.7 మిలియన్స్ కు పైగా లైక్స్ వచ్చాయి.. ఇంట్రెస్టింగ్ కామెంట్లు కూడా పెట్టారు.. “బర్బాద్ కర్ రహీ హో”.. “నీటికి నిప్పు పెడుతున్నావా?” అంటూ రెచ్చిపోయారు. ఒక నెటిజన్ ఏకంగా HOTXY అనే కొత్త పదంతో దిశాను పొగిడాడు. అర్థం అయింది కదా. హాట్ ను సెక్సీ ని మిక్సీలో వేసి ఓ కొత్త పదం కనిపెట్టాడు. పాప ఇలానే బికినీ ఎటాక్స్ చేస్తూ ఉంటే ఒక్క పదం ఏం ఖర్మ.. ఏకంగా ఓ హాటు డిక్షనరీనే కనిపెడతారు. దిశా సినిమాల విషయనికి వస్తే ప్రస్తుతం ‘మలంగ్’ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాలో హీరో ఆదిత్య రాయ్ కపూర్. అనిల్ కపూర్.. కునాల్ ఖేము ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Please Read Disclaimer