భద్రాచలం శ్రీ సీతారాముల కళ్యాణం - LIVE

రెడ్ ఐ షాడో పటానీ మత్తెక్కించిందిగా!

0

స్టైలింగ్ అండ్ ఫ్యాషన్స్ లో దిశా పటానీ స్పీడే వేరు. సాటి నాయికలకు ఠఫ్ కాంపిటీటర్. నిరంతరం ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఇచ్చే ట్రీట్ ని అభిమానులు ఏమాత్రం మిస్ చేసుకోరు. అందుకే ఇప్పటికే లక్షలాది ఫాలోవర్స్ తనని ఇన్ స్టాగ్రమ్ లో అనుసరిస్తున్నారు. తాజాగా తన ఇన్ స్టా ఫ్యాన్స్ కోసం అదిరిపోయే లుక్ ని రివీల్ చేసింది. రెడ్ ఐ షాడో తో సంథింగ్ స్పెషల్ గా కనిపించింది. ఇక స్పోర్ట్స్ ఉమెన్ తరహాలో గజిబిజి జుట్టు తో ప్రయోగాత్మక లుక్ ని ట్రై చేసింది. ఈ లుక్ లో దిషా పటాని సూపర్ స్టైలిష్ గా కనిపిస్తోంది.

బాలీవుడ్ లో అత్యంత ఆకర్షణీయమైన నటీమణులలో ఒకరిగా దిశా పటానీ వెలిగిపోతోందంటే అదేమీ అంత ఆషామాషీ కానే కాదు. దిశా తొలి చిత్రం `ఎంఎస్ ధోని: ది అన్టోల్డ్ స్టోరీ`తో బాలీవుడ్ సాధా సీదాగానే కనిపించింది. భాఘీ 2 – మలంగ్ సినిమాల్లో అత్యుత్తమ ప్రదర్శన.. పరివర్తనతో అభిమానులందరికీ ఆశ్చర్యపోయే ట్రీటిచ్చింది. ప్రస్తుతం భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించంది.

దిశా ఇటీవలే మలంగ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ తో కలిసి `రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్` చిత్రంలో నటిస్తోంది. దీనికి ప్రభుదేవ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని సల్మాన్ ఖాన్ స్వయంగా నిర్మించారు. 2020 మే 22 న విడుదల కానుంది. అలాగే మోహిత్ సూరి దర్శకత్వం వహించిన ఏక్ విలన్ 2 లో కూడా నటించనుందని తెలుస్తోంది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-