చినిగిన నిక్కరుతో ఆ ఫోజులేంటి?

0

చిట్టి పొట్టి దుస్తుల్లో వేడెక్కించడంలో లోఫర్ బ్యూటీ దిశా పటానీ తర్వాతనే. సీకే బ్యూటీగా ఈ అమ్మడికి దక్కిన పాపులారిటీ గురించి ప్రత్చేకించి చెప్పాల్సిన పనేలేదు. సినిమాలతో కంటే టాప్ మోడల్ గానే ఈ అమ్మడికి ఎక్కువ గుర్తింపు దక్కింది. సోషల్ మీడియా ఫాలోవర్స్ కంటికి కునుకు పట్టనివ్వని యాటిట్యూడ్ తో బోలెడంత ప్రచారం దక్కించుకుంది. ట్విట్టర్.. ఇన్ స్టాలో నిరంతరం ఏదో ఒక వేడెక్కించే ఫోటో లేదా వీడియోతో టచ్ లో ఉంటోంది. ముఖ్యంగా దిశా సీకే బ్రాండ్ ఫోటోషూట్లు.. జిమ్ వీడియోలు అంతర్జాలంలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.

మరోసారి అదిరిపోయే ఫోటోషూట్ తో అభిమానులకు టచ్ లోకి వచ్చింది. చినిగిన డెనిమ్స్ నిక్కరు.. రెడ్ టాప్ లో ఈ అమ్మడు ఇచ్చిన ఫోజు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఫ్రీహెయిర్ స్టైల్ తో.. కళ్లకు స్టైలిష్ గా గాగుల్స్ ని ధరించి ఖరీదైన రేంజ్ రోవర్ కార్ ని ఆనుకుని ఫోజిచ్చిందిలా. ఇంతకీ ఈ బ్రాండ్ ఏమిటో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. తన ఫేవరెట్ కెల్విన్ క్లెయిన్ బ్రాండ్ కి దిశా ఇలా ప్రచారం చేస్తోంది. 2018 దీపావళికి మొదలైన సీకే ప్రచారం ఇప్పటికీ దఫదఫాలుగా కొనసాగిస్తూనే ఉంది.

దిశా కెరీర్ ని పరిశీలిస్తే.. ఇటీవలే భారత్ చిత్రంలో అతిధి పాత్రలో నటించింది. ప్రస్తుతం మాజీ ప్రియుడు టైగర్ ష్రాఫ్ సరసన ‘భాఘి 3’లో నటించేందుకు ప్రిపరేషన్ లో ఉంది. ఈ సినిమాతో పాటు పలు క్రేజీ ప్రాజెక్టులకు దిశా సంతకాలు చేసిందని తెలుస్తోంది.
Please Read Disclaimer