సాహో లో ప్రభాస్ వాడిన బ్లూటూత్ గురించి మీకు తెలియని సీక్రెట్స్!!

హాటీకి ఎవరూ లవ్ ప్రపోజ్ చేయలేదట!

0

టైగర్ ష్రాఫ్ తో నాలుగేళ్ల ప్రేమాయణానికి బ్రేకప్ చెప్పేసి.. కేవలం స్నేహితురాలిగా మాత్రమే కొనసాగుతున్నానని చెబుతోంది దిశా పటానీ. ఇంతకుముందు ఎలా కలిసి మెలిసి ఉన్నారో ఇప్పుడు కూడా అలానే కలిసి జంటగా షికార్లు చేస్తున్నారు. ఆ ఇద్దరి మధ్యా స్నేహాన్ని మించి ఇంకేదీ లేదా? అంటూ చూసేవాళ్లంతా తలల పట్టుకుంటున్నారు.

ఈలోగానే ఆదిత్యా రాయ్ కపూర్ తో కలిసి `మళంగ్` సెట్స్ కి వెళ్లడం అక్కడ ఈ ట్యాలెంటెడ్ గయ్ తో ప్రేమలో పడిపోవడం చకచకా జరిగాయని బాలీవుడ్ మీడియా కోడై కూసింది. ఆదిత్య రాయ్ కపూర్ తో నిండా లవ్ లో మునిగిన సీకే బ్యూటీ ఇక ఏదో ఒకటి చేసేయడం ఖాయం అంటూ ప్రచారమైంది. అయితే ఇవన్నీ గాలివార్తలేనంటూ దిశా పటానీ కొట్టి పారేస్తోంది. ప్రచారం పరంగా తన పనేదో తాను చేసుకుపోతోంది. ఈ ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 14న మళంగ్ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రిలీజవుతోంది. ఇప్పటికే ప్రమోషనల్ వీడియోలు అగ్గి రాజేసిన సంగతి తెలిసిందే. దిశా పటానీ నెవ్వర్ బిఫోర్ బికినీ ట్రీట్ .. ఘాటైన పెదవి ముద్దుల ట్రీట్ అదిరిపోయింది. థియేటర్లలో పొగలు రావడం ఖాయం అన్న టాక్ కూడా వినిపిస్తోంది.

అదంతా సరే కానీ.. ఈ సినిమా ప్రమోషన్స్ లో దిశా చెప్పిన ఓ మాట కుర్రకారును కంగు తినిపించింది. మాళంగ్ ప్రమోషన్స్ లో దిశా పటానీకి ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. లైఫ్ టైమ్ లో ఇప్పటికి ఎంతమంది నుంచి ప్రపోజల్స్ ఎదురయ్యాయి? పెళ్లి ప్రతిపాదనలు ఎన్ని? అన్న ప్రశ్నలు ఎదురయ్యాయి. అయితే తనతో ఎవరూ ఇంతవరకూ పెళ్లి ప్రతిపాదన తేలేదని దిశా తెలిపింది. దిషా మాట్లాడుతూ-“కిసీ నే ప్రపోజ్ హాయ్ నహి కియా.. స్కూల్ మెయిన్ టామ్ బాయ్ థి (వాస్తవానికి.. ఎవ్వరూ నాకు ప్రతిపాదించలేదు. పాఠశాలలో నేను ఒక టామ్బాయ్) అని తెలిపింది. తన తండ్రి పోలీస్ అధికారి కాబట్టి ఎవరూ ప్రేమ ముగ్గులోకి దించే సాహసం చేయలేకపోయారని వెల్లడించింది. “డాడ్ పోలీస్ మెయిన్.. కిసి నే పూచా నహి కబీ. ఫిర్ కాలేజ్ మెయి భీ కిసి నే నహి పూచా. ఫిర్ ఇధర్ ఆ గయీ. ఇధర్ కోయి పార్టీ-వర్టీ మెయి నహీ జాతి హూన్.. తోహ్ మిలీ నహి కిసి సే“ అని దిశా అంది. తనది శాడ్ లైఫ్ అంటూ నవ్వేసింది. అయితే తనతో ప్రేమాయణం సాగించిన టైగర్ ష్రాఫ్ కూడా తనతో పెళ్లి ప్రతిపాదన తేలేదా? అందుకే బ్రేకప్ చెప్పేసిందా? అన్నదానికి సమాధానం పటానీ చెప్పాల్సి ఉంటుంది.
Please Read Disclaimer