బ్లాక్ అండ్ వైట్ లో దిశా దేవత సితక్కొట్టుడే

0

2018 దీపావళి మొదలు ప్రఖ్యాత కెల్విన్ క్లెయిన్ బ్రాండ్ కి దిశా పటానీ ప్రచారకర్తగా చేస్తున్న సందడి చూస్తున్నదే. దీపావళి రోజున సీకే బ్రాండ్ ధనలక్ష్మి ఇంటికి వచ్చును! అన్నంత కలరింగ్ ఇచ్చి దేశమంతా హాట్ టాపిక్ అయ్యింది ఆ రోజు. నాటి నుంచి ఈ అమ్మడు ఎంపిక చేసుకున్న బ్రాండ్ కి ఎలాంటి అన్యాయం జరగకుండా ప్రచారం చేసి పెడుతోంది. సీకే బ్రాండ్ కాంట్రాక్ట్ రూపంలోనే కోట్లాది రూపాయలు ఆర్జిస్తోంది. నిరంతరం సోషల్ మీడియాల్లో అభిమానుల్ని పెంచుకుంటూ అక్కడ బోలెడంత ప్రచారం చేస్తోంది.

ఒక రకంగా సినిమాలతో కంటే బ్రాండ్లతోనే ఈ అమ్మడు విపరీతంగా ఆర్జిస్తోంది. సల్మాన్ భాయ్ అంతటివాడే భారత్ లో ఆఫర్ ఇచ్చినా హిట్టివ్వలేకపోయాడు. మాజీ ప్రియుడు టైగర్ ష్రాఫ్ అవకాశాలివ్వకుడా ముఖం చాటేస్తున్నాడు ఇటీవల. కానీ సీకే బ్రాండ్ అలా కాదు. దిశా ఇమేజ్ ని అమాంతం స్కైలోకే లేపింది. దిశా ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోషూట్లతో ఫ్యాన్స్ కి ట్రీటివ్వడం వెనక బిగ్ బిజినెస్ గేమ్ ఉంది.

తాజాగా దిశా పటానీ షేర్ చేసిన బ్లాక్ అండ్ వైట్ ఫోటో అభిమానుల్లో వైరల్ గా మారింది. వైట్ ఇన్ వోర్ .. డెనిమ్స్ బాటమ్ తో అదరగొట్టింది. ఎద అందాలు.. నాభి సొగసు… 6 ప్యాక్ నడుము.. పర్ఫెక్ట్ దేహాకృతితో అమ్మడు యూత్ కంటికి కునుకు పట్టనివ్వదు. దిశా ప్రస్తుతం సల్మాన్ ఖాన్ `రాధే`లో నటిస్తున్న సంగతి తెలిసిందే. హీరో పంతి సీక్వెల్లో నటిస్తున్న మాజీ ప్రియుడు టైగర్ ష్రాఫ్ ఇటీవల దిశాను ఎందుకనో దూరం పెడుతున్నాడు. కేవలం స్నేహం కొనసాగిస్తున్నాడు. హీరో పంతి 2 చిత్రం 2021లో రిలీజ్ కానుంది.