అఫీషియల్.. ఆ సినిమాలు డైరెక్ట్ ఓటీటీల్లోనే

0

దేశవ్యాప్తంగా థియేటర్లు మూతపడి వంద రోజులు దాటిపోయింది. కొన్నాళ్లు ఎదురు చూసి వాస్తవం బోధపడ్డాక నిర్మాతలు తమ సినిమాల్ని ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్లో రిలీజ్ చేసి పడేస్తున్నారు. ఇప్పటికే కొన్ని పేరుమోసిన సినిమాలు ఓటీటీల్లో రిలీజయ్యాయి. అమేజాన్ ప్రైమ్ సంస్థ వివిధ భాషల్లో పది సినిమాల దాకా ఓటీటీ రిలీజ్కు రెడీ చేసింది. అందులో ‘గులాబో సితాబో’ ‘పెంగ్విన్’ లాంటి పేరున్న సినిమాలున్నాయి. ఐతే ఇప్పుడు హాట్ స్టార్ సంస్థ దండయాత్రకు రెడీ అయింది. ఆ సంస్థ ప్రైమ్ వాళ్లను మించి భారీ సినిమాల్ని కొనుగోలు చేసి ఆన్ లైన్ రిలీజ్కు రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే ఆ చిత్రాలేవన్నది వెల్లడైంది. ఐతే అధికారిక సమాచారం మాత్రమే రాలేదు. ఐతే సోమవారం హాట్ స్టార్ సంస్థ తాము రిలీజ్ చేయబోయే సినిమాల హీరోల్ని ఆన్ లైన్లోకి తీసుకొచ్చి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం ద్వారా ఆ సినిమాల ఆన్ లైన్ను రిలీజ్ను కన్ఫమ్ చేసింది.

అక్షయ్ కుమార్ అజయ్ దేవగణ్ అభిషేక్ బచ్చన్ వరుణ్ ధావన్ ఆలియా భట్లతో ‘బాలీవుడ్ కి హోమ్ డెలివరీ’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని హాట్ స్టార్ నిర్వహించగా.. తమ సినిమాలు ఈ ఓటీటీలో త్వరలోనే రిలీజ్ కాబోతున్నట్లు వారు ప్రకటించారు. సుశాంగ్ సింగ్ రాజ్పుత్ చివరి సినిమా ‘దిల్ బేచరా’తో ఈ భారీ చిత్రాల హాట్ స్టార్ రిలీజ్ మొదలవుతుంది. వచ్చే నెల 24న ఈ చిత్రం విడుదల కానున్న సంగతి తెలిసిందే. దాని తర్వాత అక్షయ్ కుమార్ చిత్రం ‘లక్ష్మీబాంబ్’ రిలీజవుతుంది. ఈ చిత్రానికి లారెన్స్ దర్శకుడని ఇది కాంఛన రీమేక్ అని తెలిసిందే. ఆ తర్వాత అజయ్ దేవగణ్ భారీ చిత్రం ‘భుజ్’ వస్తుంది. 1971 ఇండో-పాక్ యుద్ధం నేపథ్యయంలో సాగే ఈ చిత్రంలో రానా దగ్గుబాటి కూడా కీలక పాత్ర పోషించాడు. ఆపై అభిషేక్ బచ్చన్ మూవీ ‘బిగ్ బుల్’ను రిలీజ్ చేస్తారు. ఆలియా భట్ మూవీ ‘సడక్-2’తో పాటు విద్యుత్ జమాల్ మూవీ ‘ఖుదా హాఫిజ్’ కామెడీ మూవీ ‘లూట్కేస్’ ఆ తర్వాత వస్తాయి.
Please Read Disclaimer