స్టార్ హీరోగా ప్రాధాన్యత దక్కలేదని అసంతృప్తి!

0

ఆయనకు అభిరుచి కలిగిన దర్శకుడనే పేరుంది. సినిమాలు డిఫరెంట్ జోనర్లు ట్రై చేస్తూ ఉంటాడు కానీ హీరోయిన్లను మాత్రం పెద్దగా మార్చడు.. రిపీట్ చేస్తూ ఉంటాడు.. మొదట్లో ఒక తెలుగు హీరోయిన్ ను రిపీట్ చేసే ఈయన ఇప్పుడు మరో హీరోయిన్ ను రిపీట్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈయన చేస్తున్న ఓ మల్టిస్టారర్ సినిమాలో ఈ హీరోయిన్ కు చాలా ఇంపార్టెంట్ రోల్ ఇచ్చాడట. అయితే ఈ విషయం ఈ సినిమాలో నటిస్తున్న స్టార్ హీరోకు మింగుడు పడడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఈమధ్యే ఈ సినిమాను పూర్తిగా చూసుకుని హీరోగారు నిరాశపడ్డారట. ఇద్దరు హీరోలు ఇద్దరు హీరోయిన్లు ఉన్న ఈ సినిమాలో నలుగురికి ఒకే రకంగా ప్రాధాన్యత ఉండడంతో తనకు నచ్చలేదట. స్టార్ హీరో రేంజ్ లో ఉండే తను ఇలాంటి పాత్రల్లో నటిస్తే ఫ్యాన్స్ పెదవి విరుస్తారని.. ఇలాంటివి చెయ్యడం ఎందుకని అదేపనిగా మెసేజులు పెడతారని సన్నిహితులతో చెప్పుకుని వాపోయాడట.

అంతే కాకుండా ఇప్పటికే ఈ సినిమాకు చాలాసార్లు రీ ఎడిట్లు జరిగాయట. ఫైనల్ వెర్షన్ చూసిన తర్వాత కూడా సినిమాలో ఏదో మిస్ అవుతుందని ఈ హీరోగారు చెప్పడంతో టీమ్ అందరూ ఏం చెయ్యాలా అని తలలు పట్టుకున్నారట. మరి సినిమాను రిలీజ్ అయ్యేలోపు ఎలా సెట్ చేస్తారో వేచి చూడాలి.
Please Read Disclaimer