స్టార్ అన్నదమ్మల మధ్య గ్యాప్ ?

0

మాములుగా ఏ కుటుంబంలో అయినా అన్నదమ్ములు గొడవపడటం సర్వసాధారణం. అందులో విశేషం ఏమి లేదు. కానీ స్టార్ ఫ్యామిలీలో జరిగితే మాత్రం అది ఖచ్చితంగా న్యూసే. ఇప్పుడు ఫిలిం నగర్ లో ఈ టాకే జోరుగా నడుస్తోంది. ఆయనో సీనియర్ హీరో. ఆరు పదుల వయసులోనూ ఇంకా హీరోగా కొనసాగుతూ మార్కెట్ ని మైంటైన్ చేస్తున్నారు. ఇద్దరు వారసులను ఇండస్ట్రీకి పరిచయం చేసాక బలమైన మార్కెట్ కోసం బాగానే కష్టపడుతున్నారు.

తాజాగా ఫిలిం నగర్ గాసిప్ టాక్ లో తమ్ముడి ప్రవర్తన ఇటీవలి కాలంలో కుటుంబ సభ్యులకు కొంత ఇబ్బంది కలిగిస్తోందట. దీని వల్ల ప్రతి ఆదివారం ఖచ్చితంగా ఫ్యామిలి మొత్తం కలిసి లంచ్ చేసే అలవాటు తమ్ముడి వల్లే అప్పుడప్పుడూ మిస్ అవుతోందని వాళ్ళ సన్నిహితుల గుసగుస. గతంలోనూ ఒక కథ విషయంలో అన్నదమ్ములు ఇద్దరు హాట్ డిస్కషన్ చేసుకున్నారని దాని తర్వాత కొంత గ్యాప్ వచ్చినా తిరిగి కలుసుకున్నారని వినికిడి

దీంతో పైకి ఏదైనా ఫంక్షన్ లో కలిసినట్టు కనిపిస్తున్నా లోలోపల మాత్రం బ్రదర్స్ అప్పుడప్పుడు చిన్న చిన్న మనస్పర్థలు తెచ్చుకుంటున్నట్టు స్టూడియో వర్గాల భోగట్టా. ఇవన్నీ ఎవరి ఫ్యామిలీలో అయినా కామనే కాబట్టి పెద్ద విశేషం ఏమి లేదు కాని అప్పటిదాకా ఫాలో అవుతున్న ఒక సిస్టం ఒక్కరివల్ల కొంత మారాల్సి వచ్చినప్పుడు ఇలాంటి గాసిప్స్ రెక్కలు విప్పుకుంటాయి. ఏది ఎలా ఉన్నా ఫామిలీకి సంబంధించిన ఏ సినిమా ఫంక్షన్ జరిగితే ఇద్దరూ స్టేజిపై కలిసే కనిపించడం మర్చిపోకూడదు
Please Read Disclaimer