సాహో కోసం బరిలో డిస్ట్రిబ్యూషన్ దిగ్గజాలు

0

ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ మూవీ `సాహో`. బాహుబలి సిరీస్ ఘనవిజయం తర్వాత దాదాపు 250 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్ తో పాటు పలువురు బాలీవుడ్ స్టార్లు ఈ చిత్రంలో నటిస్తుండడం హాట్ టాపిక్. అలాగే సుజీత్ – యువి క్రియేషన్స్ బృందం రాజీ అన్నదే లేకుండా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఆగస్టు 15న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజైన మేకింగ్ విజువల్స్.. టీజర్.. పోస్టర్లు ఆకట్టుకున్నాయి.

ఇక ఈ సినిమాని దేశ విదేశాల్లో రిలీజ్ చేసేందుకు పాపులర్ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు ఒకదానితో ఒకటి పోటీపడుతుండడం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే హిందీ రిలీజ్ హక్కుల్ని ప్రతిష్ఠాత్మక టీ- సిరీస్ చేజిక్కించుకుంది. సాహో అండర్ ప్రొడక్షన్ ఉండగానే ఈ సంస్థ భారీ డీల్ కుదుర్చుకుని అడ్వాన్సులు చెల్లించిందని వార్తలొచ్చాయి. మరోవైపు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ దిగ్గజం .. దుబాయ్ బేస్డ్ కంపెనీ `ఫార్స్ ఫిలింస్` విదేశీ రిలీజ్ హక్కులు చేజిక్కించుకుందని వార్తొలచ్చాయి. ఫార్స్ ఫిలింస్ కేవలం మిడిల్ ఈస్ట్ లో మాత్రమే రిలీజ్ చేస్తుందనేది తాజా అప్ డేట్. ఇతర దేశాల్లో ప్రఖ్యాత బాలీవుడ్ దిగ్గజం యశ్ రాజ్ ఫిలింస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ రిలీజ్ చేస్తుందని రివీలైంది. అంటే బాలీవుడ్ కి చెందిన రెండు దిగ్గజ సంస్థలు.. దుబాయ్ కంపెనీ సాహో రిలీజ్ కోసం పోటీపడుతున్నాయని అర్థమవుతోంది.

ఓవర్సీస్ బిజినెస్ లో సాహో మరో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతోందని అర్థమవుతోంది. అలాగే తెలుగు సినిమాలకు విదేశాల్లో అంతకంతకు మార్కెట్ పెరుగుతోంది. అమెరికా.. బ్రిటన్.. కెనడా.. మలేషియా.. ఆస్ట్రేలియా.. న్యూజిల్యాండ్.. కొరియా .. జపాన్.. చైనా ఇలా అన్నిచోట్లా మన సినిమాలకు ఆదరణ పెరుగుతోంది. మరి యశ్ రాజ్ ఫిలింస్ సంస్థ ఏఏ దేశాలు.. ఏఏ ఏరియాలకు రైట్స్ కొనుక్కుంది అన్నది తెలియాల్సి ఉంది. యశ్ రాజ్ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న గుర్తింపు అసాధారణం. అది సాహో బిగ్ సక్సెస్ కి కలిసొస్తుందనడంలో సందేహం లేదు. బాలీవుడ్ లో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ కంపెనీల అండ యు.వి. సంస్థకు పెద్ద రిలీఫ్ అనే చెప్పాలి. బాహుబలి సిరీస్ విజయం తర్వాత మళ్లీ తెలుగు మూలాలున్న కబీర్ సింగ్ సంచలన విజయం సాధించడం మునుముందు మన సినిమాల మార్కెట్ కి పెద్ద ప్లస్ అని విశ్లేషిస్తోంది ట్రేడ్.
Please Read Disclaimer