కృష్ణ ఇద్దరి భార్యల మద్య గ్యాప్ ఎంతో తెలుసా?

0

విజయ నిర్మల మృతితో కృష్ణ జంట పక్షి ని కోల్పోయిన ఒంటరి అయ్యారు. ఏ కార్యక్రమంకు వెళ్లినా కలిసి వెళ్లే వారు. ఇద్దరు కూడా ఈ వయసులో చాలా సంతోషంగా జీవితాన్ని గడుపుతున్న సమయంలో విజయ నిర్మల గారి మృతి కృష్ణ గారికి తీరని లోటని చెప్పాలి. అయితే చాలా మందికి అర్ధం కాని విషయం ఏంటీ అంటే కృష్ణ మొదటి భార్య ఉండగా విజయ నిర్మల గారిని ఎందుకు వివాహం చేసుకున్నారు. వివాహం తర్వాత మొదటి భార్యతో ఎలాంటి రిలేషన్ ను ఆయన కొనసాగించారనే విషయం చాలా మందికి తెలియదు. అసలు కొందరు కృష్ణ గారు లేటు వయసులో విజయ నిర్మలను వివాహం చేసుకున్నాడని కూడా కొందరు అనుకుంటూ ఉన్నారు. ఆ అనుమానాలన్నింటికి సీనియర్ జర్నలిస్ట్.. కృష్ణ ఫ్యామిలీని దగ్గర నుండి చూస్తూ వచ్చిన ఇమంది రామారావు ఒక ఇంటర్వ్యూలో సమాధానం ఇచ్చారు.

ఇమంది రామారావు మాట్లాడుతూ.. కృష్ణగారు ఆయన మరదలు అయిన ఇందిరా దేవిని 1961లో వివాహం చేసుకున్నారు. పెద్దలు కుదిర్చిన వివాహం అది. పెళ్లి తర్వాత సాక్షి సినిమా సందర్బంగా విజయ నిర్మలతో కృష్ణ గారికి మొదటిసారి పరిచయం అయ్యింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. 1969వ సంవత్సరంలో రహస్యంగా కేవలం నలుగురు సాక్షుల సమక్షంలో తిరుపతిలో కృష్ణ మరియు విజయ నిర్మలగారు వివాహం చేసుకున్నారు. కృష్ణ గారిని ఆయన ఇద్దరు భార్యలు చాలా సిన్సియర్ గా ప్రేమించారు. అందుకే ఎలాంటి గొడవలు రాలేదు. విజయ నిర్మల గారిని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఇందిర గారికి ఎలాంటి లోటు రాకుండా కృష్ణ గారు చూసుకున్నారు. రెండవ పెళ్లి తర్వాత కూడా ఇందిర గారి ద్వారా కృష్ణ గారు తండ్రి అయ్యారు.

తన భర్తపై ఉన్న ప్రేమతో ఆయన ప్రేమను ఇందిర గారు గౌరవించి ఉంటారు. అందుకే ఆయన రెండవ పెళ్లి చేసుకున్న సమయంలో గొడవ చేయలేదని రామారావు అన్నారు. కుటుంబ సభ్యులు కొందరు కృష్ణగారిని తప్పుబట్టే ప్రయత్నం చేయగా ఆయన ఏం తప్పు చేయలేదని ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు కనుక ఆయన్ను ఎవరు ఏమనొద్దంటూ కృష్ణ గారికి ఇందిరా మద్దతుగా నిలిచిన సందర్బాలు కూడా చాలా ఉన్నాయట. మరో వైపు విజయ నిర్మల గారు కూడా కృష్ణ గారిని పెళ్లి చేసుకున్నా ఆయన మొదటి ఫ్యామిలీకి ఎలాంటి సమస్య రాకుండా.. తనకు మాట రాకుండా జాగ్రత్త పడ్డారట.

కృష్ణ గారి కూతుర్లు మరియు కొడుకులతో విజయ నిర్మల చాలా అన్యోన్యంగా ఉండే వారు. ముఖ్యంగా మహేష్ బాబుపై చాలా ఆప్యాయతను కనబర్చేవారు. కృష్ణ గారి కంటే కూడా మహేష్ మంచి నటుడు అంటూ విజయ నిర్మల గారు పలు సందర్బాల్లో తన అభిప్రాయంను వ్యక్తం చేశారు. మహేష్ బాబు అందం గురించి విజయ నిర్మల పలు సందర్బాల్లో గొప్పగా మాట్లాడటం జరిగింది. మొన్నటి వరకు కూడా మహేష్ బాబు నటించిన సినిమాలను కలిసి చూసేవారు. మహేష్ లాంటి బిడ్డ ఉండాలంటే పూర్వ జన్మ సుకృతం ఉండాలనే వారు.

విజయ నిర్మల కొడుకు అయిన నరేష్ మొదట్లో తల్లి మాట వినేవాడు కాదు. ఇష్టంకు వ్యవహరించే వాడు. ఆ తర్వాత మనసు మార్చుకుని తల్లి చెప్పినట్లుగా విని.. ఆమె చివరి వరకు కూడా తోడుగా ఉండి మంచి కొడుకు అనిపించుకున్నాడు. అమ్మపై ప్రేమతో తన పేరులో విజయను చేర్చుకున్నాడు నరేష్. కృష్ణ గారిని కూడా నరేష్ చాలా గౌరవించాడు. తండ్రి సమానంగా ప్రతి విషయంలో కూడా చూసుకునే వారు. కృష్ణ గారు కూడా నరేష్ ను కొడుకులా చూసుకున్నారు.
Please Read Disclaimer