కేరళ ఫ్యాన్స్ కోసం బన్నీ ఏం చేయబోతున్నాడో తెలుసా?

0

టాలీవుడ్ హీరోల్లో కేరళ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ ఉన్న హీరో ఎవరు అంటే ఠక్కున వినిపించే పేరు అల్లు అర్జున్. అక్కడ స్టార్ హీరోల స్థాయిలో అల్లు అర్జున్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రముఖ మలయాళ స్టార్ హీరోల సినిమాలకు అల్లు అర్జున్ గతంలో గట్టి పోటీ ఇచ్చిన విషయం తెల్సిందే. మలయాళ సినిమాల స్థాయిలో బన్నీ సినిమాలు అక్కడ వసూళ్లు సాధిస్తాయి. అందుకే ఈయన ప్రతి సినిమాను అక్కడ విడుదల చేస్తూ ఉంటాడు. బన్నీ తాజా చిత్రం అల వైకుంఠపురంలో సినిమాను కూడా మలయాళం లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

కేరళలో ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా బెన్ ఫిట్ షో లు ప్రదర్శింపబడింది లేదు. కాని మొదటి సారి అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో సినిమా అక్కడ ఎర్లీ మార్నింగ్ షో లు ప్రదర్శింపబోతున్నారు. దాదాపు 30 స్క్రీన్స్ లో అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో సినిమా ను అక్కడ ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు. విడుదల సమయంకు ఈ సంఖ్య పెరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఒక డబ్బింగ్ సినిమా ఎర్లీ మార్నింగ్ షోలు వేయడం అంటే మామూలు విషయం కాదు.

అక్కడ మనోడికి ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ఈ ఎర్లీ మార్నింగ్ షో లే చెబుతున్నాయి. కేరళలో అల్లు అర్జున్ ప్రతి సారి కూడా మినిమం కలెక్షన్స్ వసూళ్లు చేస్తూనే ఉన్నాడు. తెలుగు రాష్ట్రాల్లో నిరాశ పర్చిన సినిమాలు కూడా కొన్ని సార్లు అక్కడ మంచి ఓపెనింగ్స్ దక్కించుకున్న సందర్బాలు ఉన్నాయి. అందుకే కేరళలో అభిమానుల కోసం అల్లు అర్జున్ ఈసారి ఎర్లీ మార్నింగ్ షో లను ప్లాన్ చేయించాడు.

స్థానిక డిస్టిబ్యూటర్లు ఇప్పటికే అందుకు సంబంధించిన ఏర్పాట్లలో ముమ్మరం గా ఉన్నట్లు గా సమాచారం అందుతోంది. సంక్రాంతి కానుకగా 12వ తారీకున రాబోతున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటించింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో రాధాకృష్ణ మరియు అల్లు అరవింద్ లు ఈ సినిమాను నిర్మించారు.
Please Read Disclaimer