వీడియో : యాక్షన్ తో పాటు ఇదీ ఎక్కువేనా?

0

‘బాగీ’ అనగానే హిందీ ప్రేక్షకులకు భారీ యాక్షన్ సీన్స్ గుర్తుకు వస్తాయి. ఇప్పటి వరకు బాగీ రెండు సినిమాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ రెండు సినిమాలు కూడా ఒకదానికి మించి మరోటి అన్నట్లుగా భారీ యాక్షన్ సీన్స్ ను కలిగి ఉంటాయి. అద్బుతమైన యాక్షన్ సన్నివేశాలతో టైగర్ ష్రాఫ్ మరోసారి బాగీ 3 అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. ఇటీవలే వచ్చిన ట్రైలర్ తో ఖచ్చితంగా మునుపటి కంటే ఎక్కువ యాక్షన్ ఉండేలా ఉందని అంటున్నారు.

ట్రైలర్ విడుదల తర్వాత సినిమాపై అంచనాలు పీక్స్ కు చేరాయి. ఇక తాజాగా ఈ సినిమా పాటను విడుదల చేశారు. టైగర్ కు జోడీగా ఈ చిత్రంలో ముద్దుగుమ్మ దిశా పటానీ నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ అమ్మడు డు యు లవ్ మీ అంటూ పాటతో వచ్చింది. ఆ పాటలో దిశా గ్లామర్ పీక్స్ లో ఉంది. బాగీ మొదటి రెండు సినిమాలతో పోల్చితే మూడవ సినిమాలో యాక్షన్ తో పాటు గ్లామర్ కూడా ఎక్కువే అంటూ ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు.

వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న బాగీ 3 చిత్రంపై అంచనాలు మరింతగా పెంచేలా దిశా పటానీ సాంగ్ ఉంది అంటూ హిందీ ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు. బాగీ సిరీస్ లో ఇది మరో విజయంగా నిలవడం ఖాయం.. దీని తర్వాత మరో సినిమాను కూడా టైగర్ చేయడం ఖాయం అంటూ ఫ్యాన్స్ చాలా నమ్మకంతో ఉన్నారు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-