డు యూ లవ్ మీ అంటున్న దిశా పటాని!

0

బాలీవుడ్ లో ఎంతో మంది హాట్ బ్యూటీలు ఉండొచ్చు గాక.. వారిలో అంతర్జాతీయ ఘాటు అందాలు కూడా ఉండొచ్చు గాక. అయితే వారందరిలో కూడా ప్రత్యేకంగా నిలిచేది దిశా పటాని. నలుగురైదుగురు భామల్లో ఉండే హాట్నెస్ ఒకరిలో ఉంటే ఎలా ఉంటుందో దిశా అలా ఉంటుంది. అందుకే దిశ దెబ్బకు సోషల్ మీడియా రచ్చ రంబోలా అవుతుంది.

దిశా కాసేపటి క్రితం తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక వీడియో క్లిప్ పోస్ట్ చేసింది. దానికి దిశ ఇచ్చిన క్యాప్షన్ ‘డూ యు లవ్ మీ’. వీడియో క్లిప్ లో డూ యూ లవ్ మీ పాట కు బికినీ లాంటి డ్రెస్సులో రెచ్చిపోయి మరీ ఘాటు స్టెప్పులు వేస్తోంది. దిశ హీరోయిన్ గా నటించిన ‘బాఘి 3’ ఈనెల 6 వ తారీఖున విడుదలైంది. టైగర్ ష్రాఫ్ ఈ సినిమాలో హీరో. పాపం ఈ సినిమా నెత్తిన కరోనా తాటిపండు పడింది కానీ లేకపోతే కలెక్షన్స్ అదిరిపోయేవని బాలీవుడ్ ట్రేడ్ పండితులు శెలవిస్తున్నారు. కరోనా బెదరగొడుతున్నప్పటికీ ఈ సినిమా మంచి కలెక్షన్లే నమోదు చేస్తోంది. ఈ సినిమాలోనిదే ఈ ‘డూ యూ లవ్ మీ’ పాట.

ఈ వీడియోకు జస్ట్ ఒక గంటలోపే 1.7 మిలియన్ వ్యూస్ వచ్చాయంటేనే ఈ క్లిప్ ఎంత హాటో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ డ్రెస్సు.. ఆ ఎక్స్ ప్రెషన్లు.. ఆ డాన్సు గురించి మాటల్లో చెప్పలేం. ప్రవచనకర్తలు.. సంప్రదాయవాదుల దృష్టితో కాకుండా మ.. మ.. మాస్ ప్రేక్షకుల సున్నిత మనసుతో చూస్తే ఈ క్లిప్పు మహాద్భుతంగా తోచడం ఖాయం. ఎలాగూ ఇట్టాంటివాటికి భాషతో పనిలేదు కాబట్టి పటానితో కలిసి ఎంచక్కా డూ యూ లవ్ మీ అని పాడుకుంటూ ఉండొచ్చు. ఆలస్యం అమృతం విషం.. ఓ లుక్కెయ్యండి బాబులూ!
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-