యూత్ స్టార్ అయినా తనకు క్రేజ్ తెస్తాడా?

0

మహానటి` తో కీర్తిసురేష్ క్రేజ్ తారా స్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ తరువాత మాత్రం కీర్తి ఆ స్థాయిలో సినిమాలు చేయడం లేదు. కథానాయిక ప్రాధాన్యం వున్న సినిమా `మహానటి`తో జాతీయ స్థాయిలో గుర్తింపుతో పాటు పురస్కారాన్ని కూడా దక్కించుకుంది. కానీ ఆ స్థాయిలో కమర్షియల్ హీరోయిన్ గా క్రేజీ ఆఫర్లని మాత్రం దక్కించుకోలేకపోయింది.

కీర్తి సురేష్ ఆ తరువాత చేసిన సినిమాలన్నీ మహిళా ప్రధాన చిత్రాలే. థ్రిల్లర్ కథాంశంతో వచ్చిన `పెంగ్విన్`.. మిస్ ఇండియా చిత్రాలతో పాటు కీర్తి సురేష్ `గుడ్ లక్ సఖీ` అంటూ నగేష్ కుకునూర్ తెరకెక్కిస్తున్న స్పోర్ట్స్ డ్రామాలోనూ నటిస్తోంది. దీంతో కీర్తి ఇక లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో సరిపెట్టుకోవాల్సిందేనా అనే గుసగుసలు వినపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో కీర్తి సురేశ్ మల్లీ తన క్రేజ్ ని తిరిగి తెచ్చుకోవడానికి ఉన్న ఒకే ఒక ఆప్షన్ గా నిలిచిన చిత్రం `రంగ్ దే`. ఈ సినిమాతో కీర్తి కెరీర్ తెలుగునాట డిసైడ్ అయిపోతుంది. అటు మీడియం రేంజ్ హీరోలకి పెద్దగా ఇటు స్టార్ హీరోలకి చిన్నగా ఎటు కాకుండా కీర్తి సురేశ్ క్రేజ్ నడుస్తోంది. `రంగ్ దే` తరువాత ఈ బ్యూటీ ఫ్యూచర్ ఏంటో చూడాలి.