సరిలేరు తర్వాత రామ్ కు ఛాన్స్ ఇస్తాడా?

0

వరుస విజయాలతో దూసుకు పోతున్న యంగ్ డైరెక్టర్ అనీల్ రావిపూడి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే పనిలో ఉన్నాడు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రంను విడుదల చేయబోతున్నాడు. కొందరు దర్శకులు సినిమా సినిమాకు చాలా గ్యాప్ తీసుకుంటూ ఉంటారు. కాని అనీల్ రావిపూడి మాత్రం మరీ ఎక్కువ గ్యాప్ లేకుండా పక్కా ప్లాన్ తో సంవత్సరంలో కనీసం ఒక్క సినిమా అయినా విడుదల చేస్తూ వెళ్తున్నాడు. సరిలేరు నీకెవ్వరు చిత్రం తర్వాత అనీల్ రావిపూడి ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో ఒక సినిమా చేసే యోచనలో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో అనీల్ రావిపూడి గతంలోనే సినిమా చేయాల్సి ఉంది. రాజా ది గ్రేట్ కథను మొదట రామ్ తోనే అనీల్ తీయాలనుకుంటున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. కాని కొన్ని కారణాల వల్ల ఆ సినిమా రవితేజకు వెళ్లి పోయింది. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమాను మిస్ చేసుకున్న రామ్ బాధపడి ఉంటాడు. ఇటీవల అనీల్ రావిపూడి మరియు రామ్ లు కలిశారని.. ఆ సందర్బంగా ఇద్దరి మద్య ఒక కథ చర్చకు వచ్చిందని.. వెంటనే ఆ కథలో నటించేందుకు రామ్ ఓకే చెప్పాడంటూ సమాచారం అందుతోంది.

ప్రస్తుతం ‘రెడ్’ సినిమాలో రామ్ నటిస్తున్నాడు. ఆ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ కు పూర్తి అవ్వబోతుంది. ఇక సరిలేరు నీకెవ్వరు సినిమాను విడుదల చేసిన తర్వాత దర్శకుడు అనీల్ రావిపూడి స్క్రిప్ట్ వర్క్ మొదలు పెట్టబోతున్నాడు. సమ్మర్ చివరి వరకు లేదా సమ్మర్ లోనే అనీల్ రావిపూడి మరియు రామ్ ల కాంబో మూవీ పట్టాలెక్కే అవకాశాలున్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఒక హిట్ రెండు ఫ్లాప్స్ అన్నట్లుగా రామ్ కెరీర్ కొనసాగుతుంది. ఇలాంటి సమయంలో రామ్ కు ఒక మంచి సాలిడ్ సక్సెస్ అవసరం. మరి ఆ సక్సెస్ ను అనీల్ రావిపూడి ఇచ్చి రామ్ కెరీన్ కు లిఫ్ట్ ఇస్తాడా చూడాలి.
Please Read Disclaimer