మన్మథుడిని ఫాలో అవుతున్నాడా?

0

ప్రేమ.. పెళ్లి.. అమ్మాయి.. అంటే ఎందుకనో ఆ మెగా హీరో నోనో అనేస్తున్నాడట. ఎందుకంత భయం? అదేదో ఫోబియోనా? ఏమో! పెళ్లి గిల్లీ జాన్తా నయ్.. అనేస్తున్నాడట.. ఇంతకీ ఏం జరిగింది? అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే.

`చిత్రలహరి` రూపంలో సక్సెస్ పలకరించింది మెగా హీరో సాయి తేజ్ ని. ఈ ఉత్సాహంలోనే ప్రస్తుతం మరుతి దర్శకత్వంలో రూపొందిస్తున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ `ప్రతి రోజు పండగే` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. డిసెంబర్ 20న ఈ చిత్రం రిలీజవుతోంది. రాశిఖన్నా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్ హీరోకు తాతగా కనిపించబోతున్నాడు.

ఈ సినిమాతో పాటు సాయి తేజ్ మరో చిత్రాన్ని అంగీకరించిన విషయం తెలిసిందే. కొత్త దర్శకుడు సుబ్బు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. `సోలో బ్రతుకే సో బెటర్` పేరుతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ ఎల్పీ బ్యానర్పై బివిఎస్ ఎన్ (భోగవల్లి) ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ఇందులో హీరో పాత్ర గురించి ఆసక్తికర సంగతి తెలిసింది.

అమ్మాయల్ని అసహ్యించుకునే యువకుడిగా.. ప్రేమ అంటేనే గిట్టని అబ్బాయిగా సాయి తేజ్ కనిపిస్తాడట. పెళ్లి గిల్లి జాంతానయ్ అంటూ భీష్మించుకుని కూర్చుని సోలో బ్రతుకే సో బెటర్ అనుకునే పాత్రలో సాయి ధరమ్తేజ్ కనిపించనున్నాడని తెలిసింది. ఇంచుమించు ఇదే తరహా కథాంశంతో నాగార్జున నటించిన `మన్మథుడు` చిత్రం వచ్చిన విషయం తెలిసిందే. దీంతో మెగా హీరో మన్మథుడిని ఫాలో అవుతున్నాడని ప్రచారం జరుగుతోంది. కొత్త తరహా మేకింగ్ తో మరి కొత్తగా ట్రై చేస్తారా.. అన్నది చూడాలి. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మే 1న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాత ప్లాన్ చేస్తున్నారు.
Please Read Disclaimer