సామ్ మరీ ఇంత బోల్డ్ సెల్ఫీ అవసరమా?

0

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఈమద్య కాలంలో సినిమాల సందడి తగ్గించింది. అక్కినేని వారి ఇంటి కోడలు అయిన తర్వాత సినిమాల ఎంపిక విషయంలో ఆమె ఆలోచనలో మార్పు వచ్చినట్లుగా అనిపిస్తుంది. కమర్షియల్ పాత్రలు చేసి డబ్బు సంపాదించడం అని కాకుండా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు చేసి మంచి పేరు తెచ్చుకుందాం అన్నట్లుగా సమంత వ్యవహరిస్తున్నట్లుగా అనిపిస్తుంది. గత ఏడాదిలో వచ్చిన సినిమాలు ఈ ఏడాది వచ్చిన జాను సినిమా సమంత నటన ప్రతిభను తెలియజేసేవిగా ఉన్నాయి. గతంలో హాట్ ఫొటో షూట్ లు.. బికినీల్లో కూడా కనిపించిన సమంత ఈమద్య కాలంలో కాస్త హాట్ నెస్ తగ్గించినట్లుగా అనిపిస్తుంది. కాని తాజా సెల్ఫీ తో ఇన్నాళ్ల లోటును తీర్చినంత పని చేసింది.

బాత్ టబ్ లో సమంత తీసుకున్న సెల్ఫీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. బాత్ టబ్ లో క్లీవేజ్ ఎక్స్ ఫోజ్ చేస్తూ సమంత సెల్ఫీ తీసుకుని ఇన్ స్టా స్టోరీగా పోస్ట్ చేసింది. సమంత మరీ ఇంత బోల్డ్ గా ఇలాంటి సెల్పీని షేర్ చేస్తుందని అనుకోలేదు అంటూ కొందరు అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఇందులో ఏముంది తప్పు అంటూ కొందరు కామెంట్ చేస్తుంటే మరికొందరు మాత్రం సమంత విషయంలో నాగచైతన్య ఫీల్ అవుతూ ఉంటాడేమో అంటూ కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి అయతే సమంత బాత్ టబ్ సెల్ఫీ ఒక సంచలనంగా చెబుతున్నారు.