మానసిక పరిస్థితి బాగాలేని ఆమె బిగ్ బాస్ లోకి అవసరమా?

0

తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్స్ విషయంలో ప్రేక్షకులు ఏమాత్రం సంతృప్తి చెందలేదు. మొదటి రెండు వారాలు కంటెస్టెంట్స్ విషయంలో చర్చ జరిగింది. ఆ తర్వాత వారితో అలవాటు పడిపోయారు. ముగ్గురు వైల్డ్ ఎంట్రీ ఇచ్చారు. తెలుగు బిగ్ బాస్ సీజన్ సగంకు పైగా పూర్తి అయ్యింది. అయితే తమిళ బిగ్ బాస్ మొదలు అయ్యింది ఈమద్యే. తమిళ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ విషయంలో కూడా విమర్శలు నెలకొన్నాయి. ఏ ఒక్కరు బాగా తెలిసిన ఫేస్ లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సమయంలోనే తమిళ బిగ్ బాస్ క్రేజ్ ను పెంచేందుకు వివాదాస్పద సింగర్ ను వైల్డ్ ఎంట్రీ ఇప్పించేందుకు సిద్దం అవుతున్నారు.

కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోని కూడా కొందరు స్టార్స్ ను భయపెట్టిన సుచి లీక్స్ కేంద్ర బింధువు సింగర్ సుచిత్ర నేడు తమిళ బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. గత కొన్ని రోజులుగా ఆమె వైల్డ్ కార్డ్ ఎంట్రీ గురించి తమిళ మీడియాలో ప్రధానంగా చర్చ జరుగుతోంది. నేడు అది జరుగబోతుందని అంటున్నారు. ఇక సుచిత్ర ఆమద్య ప్రముఖులకు సంబంధించిన బెడ్ రూం వీడియోలను లీక్ చేయడం ఆ తర్వాత తన అకౌంట్ హ్యాక్ అయ్యిందని చెప్పండి.. ఆ తర్వాత తన మానసిక పరిస్థితి బాగాలేదు అని చెప్పడం రకరకాలుగా జరిగింది.

మానసిక పరిస్థితి సరిగా ఉండని సుచిత్రను బిగ్ బాస్ హౌస్ లోకి పంపడం ఎంత వరకు కరెక్ట్ అంటూ కొందరు తమిళ సినీ వర్గాల వారు మరియు ప్రేక్షకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బిగ్ బాస్ లో కూడా సుచి లీక్స్ ఉంటాయేమో అంటూ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. మొత్తానికి సుచిత్ర ఎంట్రీతో బిగ్ బాస్ తమిళంకు ఖచ్చితంగా క్రేజ్ పెరుగుతుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.